రాష్ట్రీయం

నేడు,రేపు ఎన్జీవోల రాష్ట్ర మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఏపి ఎన్జీవోల రాష్ట్ర మహా సభలు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. మహా సభలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 2001 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. రెండేళ్లకొకసారి జరిగే ఈ సమావేశాలు రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుండటం విశేషం. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో కొన్ని కీలక అంశాలు చర్చించనున్నట్లు ఏపి ఎన్జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు తెలిపారు. ఉద్యోగలకు సంబంధించిన పలు డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం నెరవేర్చడంతో బకాయిపడ్డ ఒక డిఎ గురించి చర్చించనున్నట్టు పేర్కొన్నారు. గ్రామ మండల స్థాయిలో కొత్తగా చేరిన విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ ఉద్యోగులను సంఘంలో చేర్చుకునే విషయంపైన ఈ సభల్లో తీర్మానించనున్నారు. ఎపి ఎన్జీవోల సంఘాన్ని మరింత బలీయమైన శక్తిగా మార్చేందుకు ఈ మహాసభల్లో కొన్ని సంస్కరణలు తీసుకురానున్నారు. రాష్టవ్య్రాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగభద్రత తదితర అంశాలను చర్చకు రానున్నాయి. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్జీవో సంఘం నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు గురువారం సమీక్షించి, పనులు పరిశీలించారు. జిల్లా అంతటా ప్రభుత్వ కార్యాలయాలకు గురువారం సెలవు రోజుగా కలెక్టర్ పి లక్ష్మీనృసింహం ప్రకటించారు.

ముగిసిన గుణదల మహోత్సవాలు

విజయవాడ, ఫిబ్రవరి 11: గడచిన మూడురోజులుగా జరుగుతున్న గుణదల మాత మహోత్సవాలు గురువారం రాత్రితో ఎంతో ప్రశాంతంగా విజయవంతంగా ముగిసాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. గుణదల మాత కరుణ కోసం తరలివచ్చిన భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. కొండపై కొలువు దీరిన మరియమాతను, కొండ శిఖరాన ఏసుక్రీస్తు శిలువను భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. గుణదల బిషప్ గ్రాసి హైస్కూలు ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన పూజా పీఠంపై విజయవాడ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, నల్గొండ బిషప్ గోవిందు జోజి, కర్నూలు మాజీ బిషప్ మాధ్యూ చెరియన్ కునె్నల్, గుణదల మాత పుణ్యక్షేత్రం రెక్టార్ ఎం.చెన్నప్ప, ఛాన్సలర్ జె.జాన్‌రాజు తదితర గురువులు ముగింపు ఉత్సవాల సమిష్టి దివ్య పూజాబలిని సమర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు భక్తులకు దివ్య సందేశమిచ్చారు.

రైతులకు అండగా ఉంటాం: జగన్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 11: వైస్సార్ కాంగ్రెసుపార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. గురువారం ఉదయం తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం, వడ్డమాను గ్రామాల్లో వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉండటంతో రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లి సెంటర్‌కు చేరుకున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్‌లో గుమిగూడిన రైతులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి అండగా ఉంటున్నారా అంటూ రైతులను ప్రశ్నించారు. రైతులు స్పందిస్తూ ఎమ్మెల్యే ఆర్‌కె సహకరిస్తున్నారని తెలిపారు. మీ సహకారం కావాలంటూ రైతులు కోరారు. దీంతో జగన్ మాట్లాడుతూ పార్టీ అన్ని వేళలా రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు తెలిపారు. న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన జగన్ తుళ్లూరు వైపుపయనమయ్యారు.
మండుతున్న కైలాసగిరులు
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 11: చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తిలోని కైలసగిరులు మండుతున్నాయి. నవంబర్,డిసెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు మొక్కలు చిగురించాయి. చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి. అయితే గత వారంరోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. రెండు రోజులుగా ఎవరో నిప్పుపెట్టడంతో కైలసగిరి కాలనీ , ఎన్టీఆర్ నగర్, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో కొండపై చెట్లు కాలిబూడిదవుతున్నాయి. మంటలు ఎక్కువై నివాస ప్రాంతాలకు వ్యాపిస్తాయోమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు , అగ్నిమాపక శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై అగ్ని మాపక శాఖ అధికారులను కూడా ప్రశ్నించామని దేవస్థానం ఎ ఇ సుశీల్‌కుమార్ తెలిపారు. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వారు తెలిపారు.
రాజస్థాన్‌లో గుండెపోటుతో
ప.గో. జిల్లా జవాను మృతి
ఉంగుటూరు, ఫిబ్రవరి 11: రాజస్థాన్‌లో బిఎస్‌ఎఫ్ జవానుగా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామానికి చెందిన చదలవాడ మురళీమోహన్ (37) బుధవారం ఉదయం విధినిర్వహణలో ఉండగా గుండెపోటుతో మృతిచెందాడు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో విధినిర్వహణలో గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మృతిచెందాడు. ఈమేరకు బాదంపూడిలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మురళీమోహన్ మృతదేహాన్ని శుక్రవారం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చి, అక్కడి నుండి బాదంపూడి తీసుకురానున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పదహారు సంవత్సరాల క్రితం బిఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికై విధినిర్వహణ చేస్తున్న మురళీమోహన్ మృతిచెందడంతో గ్రామస్థులు విచారంలో మునిగిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం బాదంపూడిలో అంత్యక్రియలు జరుగుతాయి.
భూకబ్జాదారులపై కఠిన చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూకబ్జాలకు పాల్పడే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎంతటివారైనా కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. ఇటీవలి కాలంలో పేట్రేగిపోతున్న గొలుసు దొంగల భరతం పడతామన్నారు. ఈ మేరకు పోలీసు అధికార్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని పోలీస్ అతిథి గృహంలో పోలీస్ శాఖ రూపొందించిన 2016 డైరీని గురువారం చినరాజప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కబ్జాదారుల పట్ల ప్రభుత్వం మొదటి నుండి స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, సున్నితమైన అంశాలలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. తుని హింస నేపథ్యంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించిన సందర్భంలోనూ పోలీసులు నేర్పుగా వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు.
కౌలు రైతు ఆత్మహత్య
పర్చూరు, ఫిబ్రవరి 11: మండలంలో గురువారం కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుర్రపాలెం గ్రామానికి జడ శ్రీనివాసరావు (41) ఇంటిలోనే పురుగుల మందు తాగి తనవు చాలించాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బంధువుల కథనం మేరకు కుమార్తె జ్యోతి బడికి వెళ్లగా, మృతిని భార్య, కుమారుడు పొలం పనులు చూసుకొని ఇంటికి చేరుకోగా, ఇంటిలోనే శ్రీనివాసరావు పురుగుల మందు సేవించి మంచం మీద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అతన్ని ద్విచక్ర వాహనంపై చికిత్స కోసం చీరాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందాడు.