తెలంగాణ

సాంకేతిక లోపంతో పొలాల్లో దిగిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట: హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ శిక్షణకు చెందిన హెలిక్యాప్టర్ బీదర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయాన్ని పసిగట్టిన పైలట్ మెదక్ జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో దింపాడు. ఈ సంఘటన గురువారం ఉదయం 9 గంటలకు జరిగింది. కర్నాటకలోని బీదర్‌కు వెళ్లిన హెలిక్యాప్టర్ తిరిగి వస్తుండగా యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయాన్ని వెంటనే గమనించిన పైలెట్ ల్యాండింగ్ అయ్యేందుకు అనువుగా ఉన్న నిజాంపూర్ గ్రామానికి చెందిన కొత్తగొల్ల మల్లయ్య వ్యవసాయ భూమిలో దింపాడు. ఈ విషయాన్ని హకీంపేట ఎయిర్‌పోర్టుకు సమాచారం ఇవ్వడంతో సాంకేతిక నిపుణులు మరో హెలిక్యాప్టర్‌లో వచ్చి మరమ్మతులు చేసి తీసుకువెళ్లారు. వ్యవసాయ భూమిలో హెలిక్యాప్టర్ దిగిందన్న సమాచారం తెలుసుకుని నిజాంపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని హెలిక్యాప్టర్‌ను తిలకించడంతో పాటు సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకోవడం గమనార్హం. సదాశివపేట సిఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలు ఎవరు కూడా హెలిక్యాప్టర్ దగ్గరకు వెళ్లకుండా సమీక్షించారు.

సదాశివపేట మండలం నిజాంపూర్‌లో వ్యవసాయ భూమిలో అత్యవసరంగా దిగిన హెలికాప్టర్. పైలట్లను వివరాలు అడిగి
తెలుసుకుంటున్న సిఐ వెంకటేశ్వర్లు (ఇన్‌సెట్‌లో)