తెలంగాణ

వైభవంగా వసంత పంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆలయంలోని కొలువుదీరిన శ్రీ జ్ఞానసరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి అమ్మవార్లకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేక అర్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగ మండపంలో ఆలయ డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, చైర్మన్ శరత్‌పాఠక్‌లతో ఆలయ స్థానాచార్యుడు ప్రవీణ్‌పాఠక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పఠనం చండీపారాయణం, ముఖ్య దేవత హోమాలతో వసంత పంచమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా తమ చిన్నారులకు సరస్వతిదేవి అమ్మవారి చెంత అక్షరాభ్యాస పూజలు నిర్వహించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. వసంత పంచమి వేడుకలను నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఉదయం 8.30 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సైతం వసంతపంచమి వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంత్రుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని భైంసా డిఎస్పీ అందె రాములు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డిప్యూటీ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబుచేశారు. అలాగే ఆలయంతోపాటు వివిధ సత్రాల వద్ద నిరంతరాయంగా ఉచిత అన్నదానాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.