రాష్ట్రీయం

అసంఘటిత రంగ కార్మికులకు భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: దేశంలోని 40 కోట్లమంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం స్థానిక రాష్ట్ర కార్మిక బీమా వైద్యశాలను నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి స్మార్ట్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. రిక్షా, ఆటో కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లుకు త్వరలో ఇ ఎస్ ఐ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. తిరుపతిలో రూ.110 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌ను 2016 డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు అంకితమిస్తామమన్నారు. దేశంలోని 30కోట్ల మంది భవననిర్మాణ కార్మికులకు స్మార్ట్‌కార్డులు అందించడం జరుగుతుందన్నారు. ఈకార్డులతో దేశంలోని ఏ ఇఎస్‌ఐ ఆసుపత్రిలోనైనా కార్మికులు వైద్య సేవలు పొందవచ్చన్నారు.