తెలంగాణ

మిలీషియా కమాండర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండల పరిధిలోని కోర్కట్‌పాడు అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం సీపీఐ మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీ కొండెవాయి (ఆర్‌పీసీ) మిలీషియా కమాండర్‌ను అరెస్టు చేసినట్లు వెంకటాపురం సీఐ సాయిరమణ తెలిపారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా చింతగుప్ప అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణలో సోడి ముకా అలియాస్ ముక్కయ్యగా తేలిందన్నారు. ఇతను వెంకటాపురం ఏరియా కమిటీలో మిలీషియా కమాండర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. ఇతను 2012లో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడయ్యాడని, ఇతనిపై 3 కేసులు ఉన్నాయని వివరించారు.
సత్యనారాయణపురం టవర్ కాల్చివేత, కుర్సం చైతు హత్య, మందుపాతర అమర్చిన ఘటనలో కేసులు ఉన్నాయని, అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు.