రాష్ట్రీయం

మనది.. ఆత్మగౌరవ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 12: రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలను సాధించుకోవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవ సమ్యస్యగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఏ సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చారని ప్రశ్నించారు. అన్యాయం జరిగిందని, అందుకే ఈ పోరాటమని వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని స్థితిలో ప్రధాని ఉన్నారని, అందుకే గట్టిగా అడుగుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం సీఎం మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీలు, చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని మరోసారి స్పష్టం చేశారు. విభజన చట్టంలోని 18 అంశాలపై సమీక్ష చేసి, డాక్యుమెంటరీ ఎవిడెన్సుతో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే, తాను ఆత్మ విశ్వాసం ఇచ్చానని తెలిపారు. మన కష్టాన్ని ఎవరూ తీసేయలేరన్నారు. ఇది ప్రజల ఆత్మగౌరవ సమస్య అని, తమ హక్కులను సాధించుకుంటామని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు సంబంధం లేదని ఇటీవల ఆ సంఘం సభ్యుడు చెప్పడాన్ని గుర్తు చేశారు. సెంటిమెంట్‌తో డబ్బులు రావని కేంద్ర మంత్రి అంటున్నారని, కానీ ఏ సెంటిమెంట్‌తో రాష్ట్రాన్ని విడదీశారని ప్రశ్నించారు. సెంటిమెంట్‌ను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు, చేసిన వాటిని చెప్పండి, సమీక్ష చేయండని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినట్లే, ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను గౌరవించాలన్నారు. మీ డబ్బూ- మా డబ్బూ అంటూ ఉండదని, ఆ డబ్బంతా ప్రజలేదనని వ్యాఖ్యానించారు. దక్షిణాది నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని, కానీ వాటిని ఉత్తరాదిలో ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్లకు నిధులు ఇచ్చామని చెబుతున్నారని, కానీ అది పీపీపీ రోడ్లని, కేంద్ర నిధులు కాదన్నారు. హోదా ఇచ్చి ఉంటే మరిన్ని పరిశ్రమలు ఏపీకి వచ్చి ఉండేవన్నారు. హోదా రాష్ట్ర హక్కు అని, పారిశ్రామిక రాయితీలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్, యుపీలతో ఏపీని ఏలా పోలుస్తారన్నారు. హామీలు నెరవేర్చకుండా, హోదా 10 ఏళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ తమపై ఎదురుదాడి చేస్తే, ఏం చేయను? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన తమకు సీసీఎంబీ వంటి పరిశోధనా సంస్థలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. విభజన బలవంతంగా చేశాక, ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కీలకమైన రైల్వే జోన్, సెంట్రల్ వర్సిటీ, కడప ఉక్కు కర్మాగారం వంటివి కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన అన్ని నిధులకు యుసీలు పంపినట్లు నీతి ఆయోగ్ ధ్రువీకరించినా, ఇంకా ఇవ్వలేదనడం సరికాదన్నారు. రాజధాని అమరావతిపై డీపీఆర్ పంపినా అందలేదనడం న్యాయమా అని ప్రశ్నించారు. వైకాపా ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని, మోదీ వల్లే
హోదా సాధ్యమంటూనే, ఎలా అవిశ్వాసం పెడతారని ప్రశ్నించారు. కియా కార్ల పరిశ్రమ గురించి క్లైమ్ చేసుకోవడం తప్పులేదని బీజేపీ నేతలకు చెప్పారు. అనేక రాయితీలు ఇచ్చామని గుర్తు చేశారు. తనకు ప్రజలే హైకమాండ్ అని, సహకరించకపోతే నష్టపోయేదీ బీజేపీయేనని తెలిపారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం, అవమానం జరిగిందన్నారు. బీజేపీ అదుకుంటుందని పొత్తు పెట్టుకున్నామన్నారు. హామీలు అమలు చేయమని, న్యాయం చేయమని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, హక్కుగా కేంద్రం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.