రాష్ట్రీయం

దద్దరిల్లిన అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం శాసనసభ, శాసనమండలి ఉమ్మడి సభ కాంగ్రెస్ సభ్యుల నిరసనలతో దద్దరిల్లిపోయింది. గవర్నర్ ప్రసంగ పాఠం చదువుతుండ గానే, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ రెచ్చి పోయంది. గడబిడ సృష్టించేందుకు వ్యూహం పన్నిందన్న ముందస్తు సమాచారం నేపథ్యంలో, కాంగ్రెస్ సభ్యులను అదుపుచేసేందుకు వందమంది మార్షల్స్‌ను ఉమ్మడి సభలో నిలిపి ఉంచారు. కాంగ్రెస్ సభ్యుల నిరసన తీవ్రమవడంతో, మార్షల్స్ మూడంచె ల రక్షణ వలయంగా గవర్నర్ నరసింహన్, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూధనాచారికి రక్షణగా నిలిచారు. ఒకదశలో కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లో లేచి స్పీకర్ పోడియంవైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయతే మార్ష ల్స్ వారిని నిలువరించారు. కాంగ్రెస్ సభ్యులను కదలనివ్వకుండా వారి స్థానాలను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగం పాఠాన్ని చించి ముక్కలను ఎగురవేశారు. అవి ఎవరికీ తగలకుండా కాంగ్రెస్ సభ్యులను అడ్డుకుంటూనే మరోపక్క ఆ కాగితాలను అందుకుని మార్షల్స్ పక్కన పడేశారు. పలుమార్లు కాంగ్రెస్ సభ్యులు వేదిక ముందుకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో వారు ప్లకార్డులు పట్టుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగి ఎవరేం చేస్తున్నారో తెలియని ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తెరాస సభ్యులు వౌనంగా కూర్చుని గవర్నర్ ప్రసంగానికి కరతాళ ధ్వనులతో స్వాగతం చెబుతుండగా, మరోపక్క కాంగ్రెస్ నేతలు మాత్రం నిరసనలు వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగించడంతో కాంగ్రెస్ సభ్యుల నుంచి ఒక సభ్యుడు ఇయర్ ఫోన్స్‌ను స్పీకర్ పోడియం వైపు విసిరికొట్టారు. దాంతో ఆ ఇయర్‌ఫోన్స్ (హెడ్‌ఫోన్) మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగలడంతో గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే ఆయనను అసెంబ్లీ ప్రాంగణంలోని ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. మరోపక్క బీజేపీ సభ్యులు వౌనంగానే సభ నుంచి వాకౌట్ చేశారు. సరిగ్గా అర్ధగంటలో గవర్నర్ తన ప్రసంగం పూర్తి చేశారు.
స్వామిగౌడ్‌ను పరామర్శించిన కడియం
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను సరోజినిదేవీ కంటి దవాఖానాలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. కంటి పరిస్థితి ఎలా ఉందని దవాఖాన సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్‌ను డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు. కంటికి దెబ్బతాకడంతో వాపు వచ్చిందని, కన్ను ఎర్రగా అయిందని, చికిత్స చేస్తున్నామని వైద్యులు చెప్పారు. కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దెబ్బతాకిన వెంటనే అసెంబ్లీ ఆవరణలోని జనరల్ ఫిజిషియన్‌కు చూపించామని, ఆయన సలహా మేరకు కంటి దవాఖానాకు తీసుకువచ్చారని వైద్యులు పేర్కొన్నారు.

చిత్రం..కంటికి గాయంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్