రాష్ట్రీయం

మే 7న ‘నన్నయ’ పీజీ సెట్-2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 13: నన్నయ పీజీ సెట్-2018 మే 7, 8, 9 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో షెడ్యూల్ వెల్లడించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పీజీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. రాష్టవ్య్రాప్తంగా 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలోనూ, కాకినాడ, తాడేపల్లిగూడెంలోని పోస్టుగ్రాడ్యుయేషన్ సెంటర్లలోనూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే విద్యార్థులకు నన్నయ సెట్-2018 ప్రణాళికను వీసీ ముత్యాలనాయుడు విడుదల చేశారు. అర్హత కలిగి, ఆసక్తి వున్న అభ్యర్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎసిఎన్‌యుఒఎ.ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వీసీ సూచించారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని, అపరాధ రుసుం రూ.1000 (రెగ్యులర్ ఫీజు, ఫైన్ రూ.500 కలిపి) చెల్లించి ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రుసుమును ఆన్‌లైన్‌లో డెబిట్ లేక క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఆన్‌లైన్ విధానంలో తలెత్తిన సమస్యలేమైనా వుంటే వాటిని ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీల మధ్య పరిష్కరిస్తామన్నారు. మే నెల 7వ తేదీ నుంచి జరిగే నన్నయ సెట్-2018 ప్రవేశ పరీక్షకు మే 1వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లను అభ్యర్ధులు వెబ్ సైట్ ద్వారా పొందవచ్చన్నారు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో 225, బయో టెక్నాలజీలో 135, బోటనీలో 120, జూవాలజీలో 166, ఆక్వాకల్చర్‌లో 16, మైక్రో బయోలజీలో 240, క్లినికల్ నూట్రిషన్‌లో 30 సీట్లు ఉన్నాయని, వీటిలో ప్రవేశానికి లైఫ్ సైన్స్ కామన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.
అదేవిధంగా ఎంఎస్సీ ఫిజిక్స్‌లో 336, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్‌లో 30, జియోఫిజిక్స్‌లో 30 సీట్లను భర్తీచేయడానికి ఫిజికల్ సైస్సెస్ టెస్ట్‌ను, ఎంఎస్సీ అప్లయిడ్ మేథమెటిక్స్‌లో 115, మేథమేటిక్స్‌లో 375, కంప్యూటర్ సైన్స్‌లో 200 సీట్ల కోసం మేథమెటికల్ సైస్సెస్ టెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ సంబంధిత కోర్సుల్లో 1497 సీట్లను భర్తీచేయడానికి కెమికల్ సైస్సెస్ టెస్ట్‌ను, జియాలజీలోని 20 సీట్ల కోసం జియాలజీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇక ఎంఏ కోర్సులో ఎకనామిక్స్‌లో 350, హిస్టరీలో 40, ఎంకాంలో 610, ఎంహెచ్‌ఆర్‌ఎంలో 90, పొలిటికల్ సైస్సెస్‌లో 120, సైకాలజీలో 30, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో 80, ఎంఈడీలో 350, ఎంపీఈడీలో 40, సోషల్ వర్కులో 220, ఎంఏ ఎకనామిక్స్‌లో 30 సీట్ల భర్తీకి మానవీయ విభాగాలు, సోషల్ సైస్సెస్‌లోని అంశాలపై పరీక్ష నిర్వహించనున్నామని వీసీ వివరించారు. ఎంఏ ఇంగ్లీషులోని 440 సీట్లు, ఎంఏ తెలుగులో 240, ఎంఏ హిందీలో 30 సీట్ల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ ప్రవేశ పరీక్షలు శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రంపచోడవరం, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, విజయవాడలో నిర్వహిస్తామని వీసీ ముత్యాలనాయుడు తెలిపారు. కౌనె్సలింగ్ సమయంలో విద్యార్థులకు నచ్చిన కళాశాలలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ప్రవేశం పొందే సమయంలో కౌనె్సలింగ్ సెంటర్ల వద్ద విద్యార్థుల ఒరిజనల్ సర్ట్ఫికేట్లను పరిశీలించడం జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో ఆర్ట్సు కోర్సుల్లో మొత్తం 2670 సీట్లు, సైన్స్ కోర్సుల్లో 3535 సీట్లు వెరసి 6205 సీట్లు నన్నయ సెట్-2018 ద్వారా భర్తీ కానున్నాయని వివరించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణ కళాశాల సైన్స్‌లో 307 సీట్లు, ఆర్ట్సులో 280 సీట్లు ఉన్నాయని తెలిపారు. ప్రవేశ పరీక్ష అనంతరం 24 గంటల్లో ఫలితాలను వెల్లడించనున్నామని తెలిపారు. అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ల బృదం జ్యోతిర్మయి, స్వామి, దీప్తి, డీన్స్ ఎస్ టేకి, సుబ్బారావు, రమేష్, శ్రీనివాస్, పి వర్మ, వెంకటేశ్వరరావు, సూర్యరాఘవేంద్ర, హైమావతి, విజయ నిర్మల తదితరులు విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.