రాష్ట్రీయం

ఆదరిస్తున్న మహిళాలోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల, మార్చి 13: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన పాదయాత్రకు గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో మంగళవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జగన్‌కు పూలజల్లులు కురిపించారు. జగన్ తనదైన శైలిలో ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరినీ దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించారు. జగన్ రాకకోసం ఎదురుచూస్తున్న మహిళలు వేలాదిగా దారి పొడవునా రోడ్ల మీదికి వచ్చారు. బాపట్ల ఏబీఎం కాంపౌండ్ నుండి ప్రారంభమైన జగన్ యాత్ర చిల్లరగొల్లపాలెం, మూర్తిరక్షణ నగర్, మూలపాలెం ఎస్టీ కాలనీ, అప్పికట్ల ఎస్సీ కాలనీల మీదుగా అప్పికట్లకు చేరుకుంది. ప్రతిగ్రామంలో వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి
జయజయధ్వానాలు పలుకుతూ స్వాగతించారు. వృద్ధులు తమ వయస్సును సైతం ఖాతరు చేయకుండా రోడ్లమీదికి వచ్చి జగన్‌ను చల్లగా ఉండాలయ్యా అంటూ ఆశీస్సులందించారు. జగన్ కూడా వారితో చాలా ప్రేమగా మాట్లాడుతూ, పెన్షన్ వివరాలు, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జగన్ కలిసి తమకు రిజర్వేషన్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ముస్లిం నేత పఠాన్ రాజేష్ తమకు బాపట్ల అసెంబ్లీ టికెట్ లేదా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరారు. ముస్లిం, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి వైసిపి కట్టుబడి ఉందని ఈసందర్భంగా వైయస్ జగన్ స్పష్టం చేశారు. పలువురు మహిళలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను జగన్‌కు అందజేశారు. అప్పికట్ల గ్రామంలో వైఎస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని జగన్ ఆవిష్కరించారు. వైసిపి నాయకుడు కుర్రా రాంబాబు ఆధ్వర్యంలో నిర్మించిన వైఎస్ స్మృతి భవనం, రచ్చబండలను జగన్ సందర్శించారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, మాచర్ల శాసనసభ్యులు పినె్నల్లి రామకృష్ణారెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు కళ్ళం హరినాథరెడ్డి, మోదుగుల బసవపున్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి తదితరులు జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.

చిత్రం..గుంటూరు-బాపట్ల రోడ్డు మీద జగన్ పాదయాత్ర