రాష్ట్రీయం

అమర సైనికుడికి అశ్రునివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: సియాచిన్ మంచు పర్వతాల్లో వీర మరణం పొందిన సైనికుడు ముస్తాక్ అహ్మద్(32) అంత్యక్రియలు ముస్లింల సంప్రదాయం ప్రకారం మంగళవారం కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు అమర జవానుకు తుది వీడ్కోలు పలికారు. ముస్తాక్ అహ్మద్ పార్థివదేహం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత స్వగ్రామం పార్నపల్లి చేరుకుంది. మృతదేహాన్ని చూడగానే ముస్తాక్ తల్లిదండ్రులు, భార్య రోదనలు మిన్నంటాయి. అర్ధరాత్రి దాటినా అమర సైనికుడి పార్థివదేహాన్ని చూసేందుకు ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి ముస్తాక్ అహ్మద్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ విజయ మోహన్, డిఐజి రమణకుమార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. ముస్లిం మతపెద్దలు సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహించగా అంతిమయాత్ర ప్రారంభమైంది. జై జవాన్, భారతమాతకు జై అంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తూ ముస్తాక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి శ్మశానవాటిక వద్ద ముస్తాక్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ముస్లింల శ్మశానవాటికలో సైనికులు, పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి అమర సైనికుడికి తుది వందనం పలికారు. అనంతరం ముస్తాక్ పార్థివదేహాన్ని ఖననం చేశారు.
ఉప ముఖ్యమంత్రి కెయి ప్రభుత్వం తరపున రూ.25 లక్షల చెక్కును ముస్తాక్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ముస్తాక్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని అలాగే నంద్యాల, కర్నూలులో ఎక్కడ కోరుకుంటే అక్కడ 300 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల జీవనోపాధికి నిబంధనల ప్రకారం సాగుభూమి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
chitram...
కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్లపల్లెలో మంగళవారం జరిగిన వీరజవాను ముస్తాక్ అంతిమయాత్రలో
వేలాదిగా పాల్గొన్న ప్రజలు. ముస్తాక్ పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి