రాష్ట్రీయం

నేటినుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 14: పదోతరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టామని, అన్ని రకాల వౌలిక వసతులు విద్యార్థులకు కల్పించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎక్కడైనా ఎలాంటి లోటుపాట్లు ఎదురైనా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా సదరు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ఆయన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం జడ్పీహెచ్ పాఠశాల పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పదోతరగతి పరీక్షలు 29 వరకు జరుగుతాయన్నారు. అన్ని సెంటర్లలోనూ సెక్షన్ 144ను అమలు చేస్తామన్నారు. ఉదయం 9 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి విద్యార్థులు హాజరుకావాలని, హాల్ టిక్కెట్లు చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారన్నారు. మొత్తం 6,17,484 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు 156 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్ స్వ్యాడ్లపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. నగరాల్లో విద్యార్థులు తమ తమ సెంటర్లకు సులభంగా చేరుకునేందుకు సెంటర్ లొకేషన్ యాప్‌ను రూపొందించామని, దీన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నెం 1800 5994550లో సంప్రదించవచ్చన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని, వారి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించిన మంత్రి గంటా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

చిత్రం...పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు