రాష్ట్రీయం

ఆలయ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచుతున్నారా? ఈ అంశంపై ఆలోచిస్తున్నామని దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు తెలిపారు. దేవాదాయ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ చైర్మన్ రామచంద్రమోహన్ నేతృత్వంలో కమిటీ ప్రతినిధులు మంత్రిని కలిసి చర్చించిన సందర్భంలో ఆయన ఈ విషయం చెప్పారు. దేవాదాయ శాఖ ఇటీవల జారీ చేసిన ఆరు జీఓలను నిలుపుదల చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఉద్యోగులు మంత్రిని కలిశారు. ఆరు జీఓల అంశంపై సమీక్షిస్తున్నామని, వచ్చే నెలలో సవివరంగా చర్చిద్దామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇలా ఉండగా ఆలయాల్లో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. దేవాదాయ ఉద్యోగులపై అనవసర వేధింపులు, పోలీసు కేసులు నమోదవుతుండటంపై డిజిపితో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాక మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) నేతృత్వంలో హిందూ ధార్మిక ప్రచారం పెద్దయెత్తున చేపడతామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించి, వెనుకబడిన తరగతుల వారినే పూజారులుగా నియమిస్తామన్నారు. వీరికి 10 రోజులపాటు శిక్షణ కూడా ఇస్తామన్నారు. ధూపదీపనైవేద్యాల (డిడిఎన్) పథకం కింద ఒక్కో దేవాలయానికి ఐదువేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. యువతను ప్రోత్సహిస్తూ, భజన మండళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.