రాష్ట్రీయం

ఇసుక కొల్లగొడుతున్న మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన రెండేళ్ల కాలంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అమల్లోకి తీసుకువస్తోంది. తొలుత డ్వాక్రా మహిళలకు ఇసుక తవ్వకాలు, అమ్మకాలు అప్పగిస్తే లక్షాధికారులు కాగలరంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం వారిని పక్కనబెట్టి మళ్లీ బడా బాబులకు వేలం పద్ధతిలో కట్టబెట్టేందుకు సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎన్ని విధానాలు తీసుకొచ్చినా బంగారం లాంటి ఇసుకపై మాఫియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అక్రమ తవ్వకాలతో వందల కోట్లను బాహాటంగా ఆర్జిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఆశ్చర్యకరం ఏమిటంటే రాజధాని ప్రాంతానికి భారత ప్రధాని నరేంద్రమోదీ స్వహస్తాల మీదుగా ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన జరిగి మరికొన్ని గంటల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నప్పటికీ అక్రమ ఇసుక తవ్వకాలు మాత్రం యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా పార్టీలకతీతంగా దాదాపు రాజకీయ నాయకులందరూ ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నందునే ఏ పార్టీ కూడా అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు. ఇక అధికారపక్ష నాయకులు, పాలకుల అండదండలు మాఫియాకు ఎటూ ఉండనే ఉన్నాయి.
భారీ యంత్రాలతో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతుండటం వలన అటు, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపాలు వస్తున్నాయంటూ శాస్తవ్రేత్తలు చేసిన ఫిర్యాదు మేరకు హైకోర్టు నదీ తీరంలో ఇసుక తవ్వకాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో అనూహ్యంగా పెరిగిన ఇసుక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 2011 ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇసుక బ్లాక్‌ను నివారించేందుకు మత్స్యకారులకు బోట్‌మెన్ సొసైటీల పేరిట ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ హైకోర్టులో ఉన్న స్టేను పక్కదారి పట్టించింది. చిన్న చిన్న బోట్లలో ఇసుక తవ్వకాల వలన వచ్చే ముప్పేం లేదని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించుకుంది. ప్రస్తుత రాజధాని ప్రాంతంలోని ఒక రాయపూడి శివారులోని అతి పెద్ద మత్స్యకారుల కాలనీ ఉంది. ఈ కాలనీలో 134 కుటుంబాలుండగా దాదాపు అన్ని కుటుంబాలు కూడా చిన్న చిన్న పడవలు ఏర్పాటు చేసుకుని నదిలోకి వెళ్లి ఇసుకను వెలుపలకు తీసుకొచ్చి నామమాత్రపు ధరకు విక్రయిస్తూ కొద్దికాలం జీవనం సాగించింది. ఇంతలోనే మాఫియా దృష్టి పడనే పడింది. బినామీ పేర్లతో బోట్‌మెన్ సొసైటీ ఏర్పర్చుకుని సుమారు 20 లక్షల విలువైన పెద్ద పెద్ద పడవలను ఏర్పాటు చేసుకుని లక్షలాది రూపాయల విలువైన పొక్లెయిన్లు బోట్లలోనే నదీ గర్భంలోకి తీసుకెళ్లి అడుగంటా ఇసుక తవ్వుతూ కోట్లకు పడగలెత్తింది. తీర ప్రాంతంలోని అమరావతి, వైకుంఠపురం, ఉండవల్లి, వెంకటపాలెం, రాయపూడి, బోరుపాలెం ప్రాంతాల నుంచి నిత్యం వేలాది లారీల్లో ఇసుక హైదరాబాద్, ఇతర తెలంగాణా ప్రాంతాలకు, నర్సరావుపేటకు చెందిన రాయలసీమ ప్రాంతాలకు కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు ఇసుక రాత్రి, పగలు తేడా లేకుండా తరలివెళ్తోంది. డ్వాక్రా మహిళలకు ఇసుక అమ్మకాలు అప్పగించిన తర్వాత బినామీ పేర్లతో ఇసుక మాఫియా మరో అడుగు ముందుకేసింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఒక్క రాయపూడి ప్రాంతంలోనే చిన్న చిన్న బోట్లు శిథిలావస్థకు చేరాయి. ఆశ్చర్యకరం ఏమిటంటే ఏ ఒక్క అధికారి కూడా ఇసుక మాఫియా ఆగడాలను ప్రశ్నించిన దాఖలాలు కూడా కన్పించడం లేదు. పైగా ముఖ్యమంత్రి కరకట్ట మీదే నివాసం ఏర్పర్చుకున్న తరువాత మంత్రులు, ఉన్నతాధికారుల రాకపోకలు ఉద్ధృతమైనప్పటికి కూడా బినామీ బోట్‌మెన్ ఫెడరేషన్ల పేరుతో యంత్రాలతో భారీగా తవ్వకాలు, అమ్మకాలు జరుగుతుండటం విశేషం. ఇదిలా వుండగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయి అల్లాడుతున్న మత్స్యకారులకు వ్యయ ప్రయాసలతో ఏర్పర్చుకున్న గూడు కూడా లేకుండాపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సగం సబ్సిడీ సొమ్ముతో 90 కుటుంబాలు సుమారు రెండెకరాల విస్తీర్ణంలో ప్లాట్లు ఏర్పాటుచేసుకుని నివాసాలు ఏర్పర్చుకోవటం జరిగింది.