రాష్ట్రీయం

విష్ణు సహస్రనామ విరాట్ పారాయణకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఏది సకల జనావళికి ఎల్లప్పుడూ శుభాన్ని, జయాన్ని కలిగిస్తుందో అలాంటి మహాశక్తివంతం, పవిత్రమైన శ్రీ విష్ణు సహస్ర నామ విరాట్ పారాయణ కార్యక్రమాన్ని ఓ మహత్తర యజ్ఞంగా నిర్వహించటానికి ఉద్దండరాయునిపాలెం వేదిక కానుంది. చిన జీయర్ స్వామి మానస పుత్రికైన వికాస తరంగణి కృష్ణా, గుంటూరు శాఖలు, గుంటూరుకు చెందిన భారతీ ధార్మిక విజ్ఞాన్ పరిషత్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవ్యాంధ్ర రాజధానికి కేంద్ర బిందువైన ఉద్దండరాయునిపాలెంలో 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి పారాయణ కార్యక్రమాలు ప్రారంభవౌతాయి. ఈ సందర్భంగా వేదిక వద్ద ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ కాంతిలాల్ దండే పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భీష్మ పితామహుడు లోకానికి వరంలా అనుగ్రహించిన విష్ణు సహస్ర నామాన్ని, ఆ నామాలకు ఉన్న ప్రాధాన్యతను త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అసంఖ్యాకంగా తరలి వచ్చే భక్తులకు స్వయంగా, అర్థవంతంగా వివరించి ఉపదేశించనున్నారు. అంపశయ్యపై పరుండిన భీష్మాచార్యుడు మాఘ మాసం నవమి, దశమి ఘడియల్లోనే ధర్మరాజు కోరికపై శ్రీ కృష్ణ భగవానుడి అనుగ్రహంతో విష్ణు సహస్ర నామాన్ని లోకానికి అందించారు. మాఘ శుక్ల పక్ష ఏకాదశి రోజు (్భష్మ ఏకాదశి) ప్రపంచానికి ఈ విష్ణు సహస్ర నామం వెల్లడయింది.

రుణ దరఖాస్తులకు
కాలవ్యవధి తగదు
సిఎంకు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ
ప్రత్తిపాడు, ఫిబ్రవరి 16: రాష్ట్ర వ్యాప్తంగా బలిజ, వంటరి, తెలగ, కాపుకులాల్లోని పేదల ఉపాధి కోసం చేసుకునే రుణ దరఖాస్తులు పంపేందుకు కాల పరిమితిని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ మేరకు ఈ నెల 14న సిఎంకు పంపించిన లేఖ ప్రతులను ఆయన కిర్లంపూడిలోని తన నివాసంలో మంగళవారం మీడియాకు అందజేశారు. తాను, తన భార్య పద్మావతితో కలిసి కాపులను బిసిల్లో చేర్చాలని, తమ జాతి అభివృద్ధికి ఏటా వెయ్యి కోట్లు విడుదల చేయాలనే డిమాండుతో నాలుగు రోజులపాటు చేసిన ఆమరణ దీక్ష క్రమంలో సిఎం స్పందించి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావుల ద్వారా ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించినట్టు తెలిపారు. సిఎం ఇచ్చిన హామీ మేరకు కాపులకు బిసి రిజర్వేషన్ కల్పించడానికి వేసిన మంజునాథ్ కమిషన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభింపజేయాలని ముద్రగడ సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీక్ష హామీలో భాగంగా వెంటనే విడుదల చేసిన రూ.500 కోట్లకు జాతిలో పేదల ఉపాధి కోసం పెట్టుకున్న దరఖాస్తులు మంజూరుకు జన్మభూమి కమిటీలతో నిమిత్తం లేకుండా వరుస క్రమంలో రుణాలు మంజూరు చేయించవలసిందిగా ఆయన కోరారు. ఈ విషయాన్ని సిఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసినట్టు ముద్రగడ పేర్కొన్నారు.
అన్ని గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం
కూచిపూడి, ఫిబ్రవరి 16: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారులు నూరుశాతం కాంక్రీట్‌తో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికను అమలు పరుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామానికి వచ్చిన ఆయన సర్పంచ్ మందా సుధారాణి ఇంట్లో విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 33వేల కిలోమీటర్ల అంతర్గత రహదారులు నిర్మించాల్సి ఉండగా ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం వరకు 1600 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. అలాగే పిఎంజిఎస్‌వై, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఎంపి లాడ్స్ నిధులతో 600 కిలోమీటర్ల రహదారి నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మార్చిలోగా వెయ్యి కిలోమీటర్ల రహదారుల నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 2వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఓపెన్ డెసిక్రేషన్ ఫ్రీ గ్రామాలుగా రాష్ట్రంలో వెయ్యి గ్రామాల్లో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు అమలుపరుస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరా, రహదారుల నిర్మాణాల ద్వారా మహాత్ముడు కలలుగన్న స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తమ శాఖలు కృషి చేస్తున్నాయని జవహర్‌రెడ్డి వివరించారు.
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
పెద్దదోర్నాల, ఫిబ్రవరి 16 : విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలను మంత్రి రావెల కిశోర్‌బాబు, రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి రావెల కిశోర్‌బాబు మాట్లాడుతూ చెంచు గిరిజనులు చదువుకోకపోవడంతో అభివృద్ధి చెందలేక పోతున్నారన్నారు. దివంగత నేత ఎన్టీ రామారావు ఐటిడిఎ ప్రాజెక్టును స్థాపించిన నాటినుంచి చెంచుగిరిజనులు విద్యను అభ్యశించి అభివృద్ధి పథంలో నడుస్తున్నారన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి ఉన్నత విద్యను అందించేందుకు ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యత కలిగిన విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించినప్పుడే చెంచుగిరిజనుల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అటవీప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతాలకు రావాలని పిలుపునిచ్చారు. కాగా త్రిపురాంతకం మండలంలోని దూపాడు గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ కళాశాలను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖమంత్రి రావెల కిశోర్‌బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల కళాశాల కావడంతో అక్కడ పురుష అధ్యాపకులు విద్యను బోధించడాన్ని చూసి మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపాల్ నాయక్, ఎపి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ రాములుపై తీవ్రస్థాయిలో మంత్రి మండిపడ్డారు. బాలికల కళాశాలలో పురుషులను అధ్యాపకులుగా ఎలా చేర్చుకున్నారు..? మీకు తెలివి ఉందా లేదా..? మీరు మనుషులేనా..? సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారు..? ఇక్కడ ఉన్న అధ్యాపకులు బిఇడి చేసిన వారేనని, ఈ కళాశాలలో ఎంఇడి చేసిన అధ్యాపకులు ఉండాలి కానీ, మీ సొంత నిర్ణయంగా ఎందుకు వీరిని నియమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.