రాష్ట్రీయం

వైఎస్సార్‌సీపీకి 135 సీట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను, మార్చి 18: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు వస్తాయని వేదపండితులు జోస్యం చెప్పారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం గుంటూరు జిల్లా కాకుమానులో పాదయాత్ర జరిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. జగన్మోహనరెడ్డిని పురోహితులు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు. విళంబి అంటే పొడవైనదనే అర్థం వస్తుందని, అధిక మాసాలు ఎక్కువగా ఉన్నందున దీన్ని పొడవైన సంవత్సరంగా భావించవచ్చని పంచాంగకర్తలు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వైఎస్ జగన్ జాతకరీత్యా సమస్యలన్నీ తీరిపోతాయని, ఆపై రాజయోగం పడుతుందని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని, వైసీపీకి 135 సీట్లు రావటం ఖాయమని తేల్చిచెప్పారు. జగన్ 12 సంవత్సరాల 8 నెలల 18 రోజులు అధికారంలో ఉంటారని ఆయన జాతకరీత్యా వెల్లడవుతోందన్నారు. జగన్, రాష్ట్ర హితాన్ని కాంక్షించి సహస్ర చండీయాగం తలపెట్టామని, రెండేళ్లపాటు ఈ యాగం కొనసాగుతుందని పురోహితులు తెలిపారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్ చండీయాగంలో భాగంగా పూర్ణాహుతికి హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆర్ సువర్ణ పాలనను రాష్ట్ర ప్రజలు మరోసారి చూడబోతున్నారని అన్నారు. ఉగాది ప్రతి ఇంటా మేలు చేకూర్చాలని, ప్రజలు ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జగన్ పలువురికి పంచాంగాలు పంపిణీ చేశారు. జగన్ వెంట సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, నాయకులు శ్రీకృష్ణదేవరాయలు, రావి వెంకటరమణ, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం..కాకుమానులో జరిగిన ఉగాది వేడుకల్లో పంచాంగాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న జగన్