రాష్ట్రీయం

అడ్డంకులు.. చికాకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: విళంబి నామ సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహ స్థితులను బట్టి ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగుతారు. అయితే విపక్షాల నుంచి అనేక సమస్యలు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. అందుకే బాబు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాల్సి ఉంటుందని డాక్టర్ ప్రబల సుబ్రహ్మణ్యశర్మ తన పంచాంగ శ్రవణంలో సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. తొలిసారి నాలుగు రకాల పంచాంగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. సుబ్రహ్మణ్యశర్మ తన పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని, దానివల్ల ఆశించిన ఫలితాలు చేకూరుతాయన్నారు. పాడి, పశు సంపదలో గణనీయంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధానంగా యువత పెడదారులు పట్టకుండా టీచర్లు, తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నారు. సరిహద్దు వివాదాలు ఉండబోవని, ప్రపంచ దేశాల సహాయం కేంద్రానికి పుష్కలంగా లభిస్తుందన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పాలకులు ఉభయులు కూడా ఎవరి వ్యక్తిత్వం వారు కాపాడుకుంటూ ముందుకు సాగుతారని తెలిపారు. రావూరి వెంకటసాయి వరప్రసాద్ వ్యవసాయ పంచాంగాన్ని చదువుతూ ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పరిశోధనతో రూపొందించిన ఈ పంచాంగం రైతులకు ఓ కరదీపిక అన్నారు. ఏ పంటలు ఎపుడు ఎంచుకోవాల్సింది, ఎప్పుడు కోతలు, ఎపుడు నూర్పిళ్లు అవసరమో తెలియచెప్పామన్నారు. ఈ ఏడాది గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఉగాది పర్వదినం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ప్రతి గ్రామంలో పంచాంగ శ్రవణం ఉంటుందని, ఇది మన సంస్కృతి గొప్పతనమన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కె శిరీష, బి శిరీష నిర్వహించిన నేత్రావధానం సభికులను ముగ్దుల్ని చేసింది. చంద్రబాబు సూర్యుడు, బుద్ధప్రసాద్ చంద్రుడు అనే పదాలను కాగితాలపై రాసివ్వగా ఒకరు నేత్రాలతో చెప్పగా మరొకరు వాటిని కాగితాలపై రాసి చూపారు. నేత్రావధానం ప్రపంచంలో ఒక్క తెలుగువారికే సొంతమంటూ వారిని బాబు అభినందించారు.

చిత్రం..పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు