రాష్ట్రీయం

26 మందికి ఉగాది పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా వేదపండితులు, పంచాంగకర్తలకు, యాజ్నీకులకు, అర్చకులకు, ఆగమ పండితులకు, జ్యోతిష్య పండితులకు, ఆధ్యాత్మికవేత్తలకు, పురాణప్రవచనాలు చేసే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందచేసింది. పురస్కారాలు అందుకున్న వారిలో మొత్తం 26 మంది ఉన్నారు.
పురస్కారాలు అందుకున్న వారిలో పంచాంగ శ్రవణం చేసిన బాచుపల్లి సంతోష్‌కుమార్, కూచి ఆది వెంకట చంద్రశేఖర శర్మ, గుదిమళ్ల మురళీకృష్ణమాచార్యులు, ఆర్. వేణుమాధవ శర్మ, చక్రపాణి నరసింహమూర్తి, ప్రవీణ్‌కుమార్ చార్యులు, నడుపూడి మఠం భవానయ్య స్వామి, గట్టు యాదగిరి స్వామి, బి. జగన్నాధ చారి, అడ్డేపల్లి, లక్షణాచార్యులు, గణాచారి మఠం సాంబశివుడు, పి. ఫణీంద్ర, జోషి మధుసూదన శర్మ, సంపత్‌కుమార్ కృష్ణమాచార్య, బిదురు రాజశేఖర శర్మ, మఠం, కళ్యాణయ్య స్వామి, ఆర్. అశోక్, బుద్ధన్నగారి నారాయణ, భాస్కరభట్ల ఆంజనేయ శర్మ, మందపల్లి పరాంకుశాచార్య స్వామి, వల్లీ నాయగం, చెరకు రాజేశ్వర శర్మ, పురాణం చంద్రవౌళి శర్మ, దోర్బల విశ్వనాథ శర్మ, ఆకెళ్లజయకృష్ణ శర్మ, డాక్టర్ సందుగు కృష్ణమాచార్యులు ఉన్నారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవానికి హాజరు కావాలంటూ భద్రాచలం ఆలయ ఆలయ అర్చకులు ఆలయం తరఫున ఒక లేఖను ముఖ్యమంత్రికి అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగే పంచాంగ శ్రవణం ఈ సంవత్సరం ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులోని జనహిత, ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. గత ఏడాది కూడా ఇదే వేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగే పంచాంగ శ్రవణం జరిగింది.
యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తరఫున ప్రచురించిన పంచాంగాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆదివారం జరిగిన విళంబి నామ ఉగాది ఉత్సవాల కార్యక్రమానికి వచ్చిన అందరికీ రుమాళ్లు, తెలుగుభాషకు సంబంధించిన పుస్తకాలను భాషా సాంస్కృతిక శాఖ తరఫున అందచేశారు. ఉగాది పచ్చడి, భక్ష్యాలు అందచేశారు. జనహిత ముందు భాగంగాలో తెలంగాణకు వనె్న తెచ్చిన కళారూపాలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహరెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి, నగరమేయర్ రాంమోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, రెవెన్యూ (దేవాదాయ) ముఖ్యకార్యదర్శి శివశంకర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..భధ్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ ఆహ్వాన పత్రికను సిఎం కేసీఆర్‌కు అందిస్తున్న అర్చకులు