రాష్ట్రీయం

ఏపీ అంతటా త్వరలో సొంత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 19: నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వచ్చే మే నాటికి సొంత భవనాల్లో ఎసీబీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు పూర్తయ్యాయని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో రూ. 1.05 కోట్లతో అన్ని వసతులతో ఎసీబీ కార్యాలయం నిర్మించామన్నారు. రాష్ట్రంలో 354 కొత్త పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్మించిన ఎసీబీ కార్యాలయాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన భవనాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతేడాది మే నెలలో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు భవన నిర్మాణం పూర్తయిందన్నారు. 3,730 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించామన్నారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా 10 సొంత భవనాలు పూర్తయ్యాయన్నారు. అనంతపురంలో నిర్మించిన భవనాన్ని ఆదివారం పరిశీలించామన్నారు. మరో 3్భవనాలు తుదిదశలో ఉన్నాయని మే 2018 నాటికి రాష్టవ్య్రాప్తంగా శతశాతం ఏసీబీకి సొంత భవనాలు పూర్తవుతాయన్నారు. త్వరలో రాష్టవ్య్రాప్తంగా 354 కొత్త పోస్టులను భర్తీ చేస్తామని, తద్వారా ఈ జిల్లాకు మరిన్ని అదనపు పోస్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారని, కొత్త నియామకం ద్వారా అదనంగా ఒక ఇన్‌స్పెక్టర్‌తోపాటు, సబ్-ఇన్‌స్పెక్టర్, ఎ.ఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్ళుతోపాటు మరిన్ని పోస్టులు భర్తీ అవుతాయన్నారు. రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖను బలోపేతం చేసందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే అదనపు పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కేసులు నమోదు, దర్యాప్తు తదితరపనులు విషయంలో సిబ్బంది కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు పోస్టుల భర్తీతో తొలగిపోతాయన్నారు. ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఆస్తులను సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. గతంలో చెక్ పోస్టులపై ఆకస్మిక దాడుల ఉనిర్వహించే సమయంలో నమోదైన కేసుల విచారణ కొనసాగుతోందని ఠాకుర్ స్పష్టం చేసారు. తొలుత ఎస్పీ త్రివిక్రమవర్మ ఠాకూర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సమావేశంలో ఏసీబీ సంయుక్త సంచాలకులు మోహనరావు, డీఎస్పీలు వి.్భమారావు, కృష్ణమూర్తినాయుడు, సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..విశాఖపట్నంలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతున్న ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఠాకూర్