రాష్ట్రీయం

మావోల విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: వరుస దాడులతో తెలంగాణ - చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టులు, పోలీసు జవాన్లు పరస్పరం పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సామాన్య జనం ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా సోమవారం తెల్లవారుఝామున చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తుమ్‌నార్ - కోయిట్‌పల్లి మధ్య రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న 6 వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. రోడ్డు కాంట్రాక్టర్ కుమారుడు విశాల్‌ను దారుణంగా హత్య చేశారు. రోడ్డు పనులు నిలిపివేయాలంటూ కొంతకాలంగా కాంట్రాక్టర్లు, ప్రభుత్వానికి వారు హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా సీలేరు అడవుల్లో జరిగిన సభలో అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ప్రకృతిని కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు పెద్దపెద్ద రోడ్లు వేస్తే అడ్డుకుంటామని కూడా మావోలు హెచ్చరించారు. ప్రజలకు అవసరమైన మేరకు చిన్న రోడ్లు మాత్రమే వేయాలని సూచించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు తాజా దుశ్చర్యకు పాల్పడ్డారు. గత నెలలో బస్తర్ జిల్లా పరిధిలోని మార్డుం పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎంజీఎస్‌వై పథకంలో భాగంగా రోడ్డు నిర్మాణంలో ఉన్న 10 ట్రాక్టర్లతో పాటు మరికొన్ని ఇతర వాహనాలనూ తగులబెట్టారు. మోదకపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బట్టుపల్లి, సంకనపల్లి రహదారి నిర్మాణంలో పనిచేస్తున్న ఒక కంకర మిక్సర్, 9 ట్రాక్టర్లను దగ్ధం చేశారు. నెలరోజుల వ్యవధిలోనే సుమారు 30కి పైగా వాహనాలను మావోలు తగులబెట్టటంతో పాటు రోడ్డు నిర్మాణంలో పనిచేసే కార్మికులను కొట్టి పనులు కొనసాగిస్తే చంపేస్తామని బెదిరించినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇదిలావుంటే, సుకుమా జిల్లా ఎర్రబోరు పరిధిలో 30వ నెంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్న ఓ టిప్పర్‌ను తగులబెట్టి రోడ్డు నిర్మాణం అపివేయాలని కొద్దిరోజుల క్రితం మావోలు డిమాండ్ చేశారు. ఎన్ని హెచ్చరికలు చేసినా పనులు నిలిపివేయక పోవటంతో సోమవారం తెల్లవారుఝామున వాహనాల దహనానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 100కి పైగా మావోయిస్టులు ఆధునిక ఆయుధాలతో పాల్గొన్నట్లు సమాచారం. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారీగా నష్టపోయిన మావోలు దానికి ప్రతీకారంగా దాడులకు తెగబడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారిని ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను రప్పించి కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టులపై పైచేయి సాధించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీస్ అధికారులు త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.

చిత్రాలు..మావోయిస్టులు దగ్ధం చేసిన జేసీబీలు, ట్రాక్టర్లు, మిక్సర్..
*మావోల చేతిలో హతమైన విశాల్