రాష్ట్రీయం

హోదా ఎందుకివ్వరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 20: హేతుబద్ధతలేని విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని, రాజ్యాంగపరంగా హక్కులు, హామీలు నెరవేర్చాలని అడుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి తెగేసి చెప్పారు.ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిందే ఏపీకి ఇవ్వమని అడిగామని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని అన్నారు. ‘అయినా చర్చకు కూడా తావులేకుండా చేస్తారా.. ఇంత లెక్కలేనితనమా మీకు..’అంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. మంగళవారం శాసనసభలో ‘పెట్టుబడులు- పారిశ్రామిక అభివృద్ధి- ఉపాధి కల్పన’ అనే అంశంపై జరిగిన లఘు చర్చలో మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వాల అవినీతి కారణంగా పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపటంలేదని విమర్శించారు. గత నాలుగేళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి విశ్వసనీయత కల్పించామని, ఫలితంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రెండంకెల వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో పురోగతి సాధించేందుకు కేంద్ర సహకారం తప్పనిసరన్నారు.కేంద్రం సహకరించకపోయినా ఈ ఏడాది 11.22 శాతం వృద్ధిరేటు సాధించ గలిగామని, సాయం అందితే మరింత అభివృద్ధి సాధించే వీలుంటుందని చెప్పారు. అయితే పారిశ్రామిక, సేవల రంగంలో
వెనుకబడిన కారణంగా తలసరి ఆదాయం తగ్గుతోందని వివరించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 1,75,450 తలసరి ఆదాయం ఉంటే రాష్ట్రంలో 1,42,054 మాత్రమే ఉందన్నారు. ఈ కారణంగానే గత నాలుగేళ్లుగా ప్రజా ప్రయోజనాలను కాంక్షించి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నామని వివరణ ఇచ్చారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని, ఉద్యానవన, ఆక్వా రంగాల్లో గణనీయమైన వృద్ధిరేటు సాధించామన్నారు. గత నాలుగేళ్ల క్రితం ఏ ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి మంజూరైందో వివరించాలన్నారు. అవినీతి కారణంగానే వోక్స్ వ్యాగన్ ఇతర రాష్ట్రాలకు తరలించారని గుర్తుచేశారు. ఓ పద్దతిలేకుండా భూ కేటాయింపులు జరపటంతో పాటు 64వేల ఎంఎస్‌ఎంఈలను మూసివేశారని ఫలితంగా చిన్నచిన్న పారిశ్రామికవేత్తలతో పాటు ఉపాధి కోల్పోయి కార్మికులు వీధినపడ్డారని ఆరోపించారు. వ్యవసాయ వృద్ధి కారణంగా కేంద్రానికి 34 శాతం జీఎస్‌డీపీ కంట్రిబ్యూషన్ వచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 18.55వేల కోట్లతో 2536 ఎంఒయులు కుదుర్చుకుందని 45 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యంమని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఓ ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో 45 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. వాన్‌పిక్, లేపాక్షి, సెజ్‌ల పేరుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం దోచేసిందని మండిపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్న నేతలు తమ ప్రభుత్వం అనంతపురం జిల్లాకు నీటితో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. కియామోటార్స్ సంస్థ 13వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, ఇదే ప్రాంతంలో మరో 16 యాంకర్ యూనిట్లు నెలకొల్పుతున్నట్లు తెలిపారు. తిరుపతి, చెన్నై, నెల్లూరు, అనంతపురం ఆటోమొబైల్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి ఓర్వకల్లు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామన్నారు. నంధ్యాలలో మెగా సీడ్ పార్కు, తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్, శ్రీసిటీని హార్డ్‌వేర్ హబ్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ- ముంబై కారిడార్‌కు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం విశాఖపట్నం- చెన్నై (వీసీటీసీ), చెన్నై- బెంగుళూరు (బీసీటీసీ) కారిడార్లకు మాత్రం అప్పులు తెచ్చుకోమంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పెట్టుబడులకు ఇప్పుడు అనువైన వాతావరణం ఉందని గ్రహించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఒప్పందాలు కుదుర్చు కుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 7 మెగా నాలుగు ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు ఏర్పాటవుతున్నాయి.. రూ 16వేల 120- కోట్లతో టెక్స్‌టైల్ రంగంలో 104 ఎంఒయులు కుదిరాయన్నారు. మరో 25 వేల కోట్లతో మైనింగ్ పరిశ్రమలను నెలకొల్పేందుకు 65 సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. ఐటి రంగంలో 31 ఎంఒయులు, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. ఒక్క పైసా అవినీతిలేకుండా పారదర్శకంగా పెట్టుబడులు సాధించి అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుంటే సహకరించకపోగా నాపై దాడిచేసేందుకు ఉసి గొల్పుతున్నారని చంద్రబాబు కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించిన పారిశ్రామిక రాయితీలు 3100 కోట్లు తిరిగి ఇస్తే అభివృద్ధి పనులకు ఉపయోగపడవా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు యూపీఏ హయాంలోనిదే అని.. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. మాకు అండగా ఉంటామని వచ్చిన ఓ నాయకుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.. నాపై అభియోగాలు రాత్రిళ్లు కలలోకి వచ్చాయా.. అని పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.