రాష్ట్రీయం

తేల్చుకుందాం.. రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు గెలుస్తారో ప్రజలే తేలుస్తారు ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమెందుకు?
తెదేపా ఎమ్మెల్యేలు మాకూ టచ్‌లో ఉన్నారు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతాం
కెసిఆర్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నారు పాలమూరు ఎత్తిపోతలతో రాయలసీమ ఎడారే
చంద్రబాబుపై నిప్పులు కురిపించిన జగన్ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పణ

హైదరాబాద్: ‘అసెంబ్లీలో మా పార్టీకి 67మంది సభ్యుల బలం ఉంది. తెదేపా ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైన సంఖ్య 21. ఆ సంఖ్య వచ్చినప్పుడు వారి పేర్లు చెబుతాం’ అని వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వారి పేర్లు చెప్పిన గంటలోగానే చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ఆలోచనలకు స్వస్తిచెప్పి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి జనంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. మీరు గెలుస్తారా, మేం గెలుస్తామో జనం తేలుస్తారని అన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. బుధవారం ప్రతిపక్షనేత జగన్, తన ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా సాగునీటి ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో రాజీపడ్డారన్నారు. తన స్వార్ధం కోసం కెసిఆర్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 90 టిఎంసిల నీళ్లు తెలంగాణకు మళ్లిస్తే రాయలసీమ ఏడారి అవుతుందన్నారు. గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల సంక్షేమానికి రాజ్యాంగ బద్ధంగా కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన సభ సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైల్వే ట్రాక్‌వెంట బారికేడ్ నిర్మించలేదన్నారు. అంతమంది ప్రజలు ఒకచోట గుమిగూడితే మాస్ హిస్టీరియాకు గురవుతారన్నారు. ప్రభుత్వానికి ముందు చూపులేనందు వల్ల దుర్ఘటన జరిగిందన్నారు. దీనికి వైకాపా మీద నిందలు వేయడం, అమాయకులపై కేసులు పెట్టడం తగదన్నారు. ఇంత భారీఎత్తున జనం చేరితే ఏమైనా జరగవచ్చని అంచనావేయడంలో పోలీసు ఇంటెలిజెన్స్ విఫలమైందన్నారు. కాపుల డిమాండ్లను తెలియచేస్తూ నాలుగు నెలల ముందుగా ముద్రగడ పద్మనాభం లేఖలు రాస్తే చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సాధించిన ఘన విజయాలు ఉంటాయని, కాని అవేమీ జరగడంలేదన్నారు. ప్రభుత్వం తప్పులతడకలతో కూడిన అంశాలను గవర్నర్ ప్రసంగంలో చేరుస్తోందన్నారు. తాము కూడా వాస్తవానికి ఏం జరుగుతుందో గవర్నర్‌కు తెలియచేశామన్నారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ ఒక లక్ష కోట్ల రూపాయలకుగాను, కేవలం 7 వేల కోట్ల రూపాయలను రెండు విడతలుగా మాఫీ చేశారన్నారు. అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో ప్రజా సంక్షేమ విధానాలు చర్చించకుండా మంత్రులను పట్టుకుని వైకాపా వారిని ఫిరాయింపులను ప్రోత్సహించాలని కోరడమేంటన్నారు. కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావును చూసి నేర్చుకోండంటూ మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు అబద్ధాల కోరని, ఆయన వద్ద బ్లాక్‌మనీ చాలా ఉందని విమర్శించారు.

చిత్రం... చంద్రబాబు పాలనలోని ప్రజా వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందిస్తున్న వైకాపా అధినేత జగన్