రాష్ట్రీయం

నేటి మీడియా పోకడలను ఎత్తిచూపిన ‘సుప్రభాతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 20: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆనం కళాకేంద్రంలో ప్రదర్శించిన సాంఘిక నాటకాలు సందేశాత్మకంగా సాగాయి. ఉదయం ప్రదర్శించిన సుప్రభాతం సాంఘిక నాటిక నేటి తరం మీడియా పోకడలను ఎత్తిచూపింది. సమాజాన్ని చైతన్యపరిచి, ప్రజాసమస్యలకు అద్దంపట్టేలా పత్రికలు ఉండాలని నాటిక చాటిచెప్పింది. అన్యాయానికి పాల్పడేవారికి బుద్ధిచెప్పే విధంగా పత్రికలు పనిచేయాలని హితవు పలికింది. పాలకొల్లు శ్రీ్ధర రాధ ఆర్ట్స్, కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటికను ఎంవికె మోహన్ రచించగా, రామసుబ్బారావు దర్శకత్వం వహించారు. కళావాణి ఉభయ గోదావరులు ప్రదర్శించిన ‘్భమి దుఃఖం’ నాటిక భూమితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పింది. ఆర్ ఉదయ్‌భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నాటికను జిఎస్ ప్రసాద్‌రెడ్డి రచించారు. భూమితో మానవుని బంధం, మానవత్వాలకు తగ్గిపోతున్న అనుబంధాలను ఈ నాటిక చర్చించింది. మధ్యాహ్నం ప్రదర్శించిన ఏలూరు వారి ఎజిఆర్ ఆర్ట్స్ వారి ‘నాగులు తిరిగే కోనలో’ నాటికను యువరాజు పెందుర్తి రచించగా, కడుపు భాస్కరరావు దర్శకత్వం వహించారు. నాగులకోనలో తిరిగే కోనలో నాటిక పోలీసులు సమాజంలో తమ గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికింది. పోలీసులంటే ప్రజలను రక్షించే రక్షకభటులని, అలాంటి వారు అత్యాచారాలు, హత్యలకు పాల్పడితే బాధితులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అభాగ్యులకు సేవ చేయడమే దైవ సేవ అని ‘ఆఖరి మజిలీ’ నాటిక చాటిచెప్పింది. శ్రీశృంగార వల్లభకళా ఆర్ట్స్ తిరుపతి వారి ఆఖరి మజిలీ నాటికను కాశీ విశ్వనాధం రచించి, దర్శకత్వం వహించారు. బంధాలు, ఆత్మీయతలు పెనవేసుకుని, కష్టాల్లో ఉన్న సాటి మనిషిని ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఆదుకోవడమే ఆసలైన మానవత్వమని ఈనాటిక హితవు పలికింది. పిళ్లా రామ్‌ప్రసాద్ రచించి దర్శకత్వం వహించిన ‘మేడిపండ్లు’ నాటిక యువత అవకాశవాదంతో వ్యవహరిస్తే సమాజంలో కలిగే విపరిమాణాలను చర్చించింది. యువత అవకాశవాదంతో వ్యవహరిస్తే సమాజంలో మార్పు రాదని నాటిక స్పష్టం చేసింది. గురజాడ యువకళాకేంద్రం విజయనగరం వారు మేడిపండ్లు నాటికను ప్రదర్శించారు. కరీంనగర్ జిల్లా నాటకరంగ కళాకారుల సమాఖ్య వారి ‘అమ్మ’ సాంఘిక నాటికను గంటా విజయరావు రచించి, దర్శకత్వం వహించారు. మంగళవారం రాత్రి చివరగా ‘హైటెక్కు సిటీ’ నాటికను ప్రదర్శించారు. వి సంగమేశ్వరరావు రచించిన ఈనాటికకు ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించారు. మాతృశ్రీ కళానికేతన్ ఆధ్వర్యంలో ఈ నాటికను ప్రదర్శించారు.

చిత్రం..సుప్రభాతం నాటికలో ఓ సన్నివేశం