రాష్ట్రీయం

అల్లూరి వీరత్వాన్ని కళ్లకుకట్టిన మన్య విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 21: స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ సేనలను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటాన్ని కళ్లకు కట్టింది ‘మన్య విప్లవం’ నాటిక. రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీచైతన్య కల్చరల్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో ప్రదర్శించిన మన్యవిప్లవం సాంఘిక నాటిక ఆద్యంతం రక్తికట్టించింది. స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవజ్యోతి అల్లూరి సాగించిన వీరోచిత పోరాటాన్ని, ఆనాటి బ్రిటిష్ పాలకుల ఆగడాలను ఈ నాటిక తెలియజెప్పింది. కూనిరెడ్డి శ్రీనివాస్ రచించి, దర్శకత్వం వహించారు. ఆడది అబలకాదు ఆదిపరాశక్తి అని చాటిచెప్పింది ‘ఆడది అబలకాదు’ సాంఘిక నాటిక. కరీంనగర్ చైతన్యకళాభారతి వారి ఈ నాటికను రాములు సత్యనారాయణ రచించి దర్శకత్వం వహించారు. వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులకు గురిచేయడంతో పాటు మరో పురుషుడితో గడపాలని ఒత్తిడి చేయడంతో ఆమె ఆదిపరాశక్తిగా మారి, ఆడది అబలకాదని నిరూపిస్తుంది. భర్తతోపాటు, పర పురుషుడ్ని కూడా హతమార్చి ఆదిపరాశక్తిగా మారుతుంది. దారితప్పిన మాజీ మావోయిస్టు ఉదంతాన్ని కళ్లకు కట్టింది ‘మార్గదర్శి’ నాటకం. నవరస ఆర్ట్స్ ధియేటర్ కరీంనగర్ వారి మార్గదర్శి నాటకాన్ని సిద్ధార్థ రచించగా, ముత్తోజు రాజు దర్శకత్వం వహించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడి పెద్దకుమారుడు మావోయిస్టుల్లో చేరితే మరో కుమారుడు తండ్రి ఆశయాల మేరకు సైన్యంలో చేరతాడు. దళనాయకుడి స్థాయికి ఎదిగిన పెద్దకుమారుడి భార్య ఎన్‌కౌంటర్‌లో మరణించగా, అతను ప్రభుత్వానికి లొంగిపోతాడు. ఆ తరువాత ఒక అవినీతిపరుడైన సీఐతో కలిసి అవినీతి కార్యకలాపాలు, భూదందాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడతాడు. అనంతర పరిణామాల్లో అతని కుమారుడు సీఐ చేతిలో హతమవుతాడు. దీంతో ఆగ్రహించిన మాజీ మావోయిస్టు సీఐని కాల్చి చంపుతాడు. అతని తండ్రిపై గౌరవంతో పోలీసులు కేసును నీరుగారుస్తారు. ఇదే సమయంలో ఉపాధ్యాయుడి చిన్నకుమారుడికి మేజర్‌గా పదోన్నతి వచ్చినట్లు సమాచారం రావడంతో ఏడవాలో నవ్వాలో తెలియక ఆయన నిర్లిప్తంగా ఉంటారు. అలాగే ఈటల నాటకరంగ కళాకారుల సమాఖ్య హుజరాబాద్ వారి ‘ఓ ప్రేతాత్మ దిగిరా’ నాటకం కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ నాటకాన్ని రావుల పుల్లాచారి రచించగా, కొలుగూరి దేవయ్య దర్శకత్వం వహించారు. గురువారంతో నంది నాటకోత్సవాలు ముగుస్తాయి. 9 రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు ప్రేక్షకులను, ముఖ్యంగా ఆనాటి నాటక ప్రియులను అలరించాయి.