రాష్ట్రీయం

కదం తొక్కిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధనం పూర్తిగా విజయవంతమైంది. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి పిలుపులో భాగంగా 13 జిల్లాల్లోని జాతీయ రహదారులతోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న రాష్ట్ర రహదారులను అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా దిగ్బంధించి ఉద్యమకారులకు మద్దతుగా నిలిచారు. రెండు గంటలపాటు కొనసాగిన దిగ్బంధనంతో జాతీయ రహదారుల వెంబడి కిలోమీటర్ల పొడవునా వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమేనని, తదుపరి హోదా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రత్యేక హోదా, విభజన సాధన సమితి నేతలు ప్రకటించారు. రాష్టవ్య్రాప్త కార్యక్రమంలో భాగంగా విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి మార్గంలోని కనకదుర్గ వారధి దగ్గర జాతీయ రహదారి దిగ్బంధనం విజయవంతమైంది. సీపీఐ, సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తూర్పారబట్టారు. పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు రాస్తారోకోలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దిగ్బంధనాన్ని మధ్యాహ్నం 12 గంటల వరకూ కొనసాగించారు. ఉదయం 9 గంటలకే పోలీసు బలగాలు పెద్దఎత్తున కృష్ణా, గుంటూరు సరిహద్దు ప్రాంతమైన వారధి దగ్గరకు చేరుకున్నారు. తొలుత వారధి ప్రారంభ మార్గంలోని జాతీయ రహదారిపై సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి. మధు, సినీనటుడు శివాజీ, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు నిరసనకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. శివాజీ అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆగివున్న లారీపైకి ఎక్కి నిరసించారు. దాదాపు అర్ధగంట వరకూ ఆయన లారీపైనే ఉండి నిరసన వ్యక్తం చేశారు.
డప్పులు కొట్టిన రామకృష్ణ, మధు
జాతీయ రహదారిపై ప్రత్యేక హోదా ఉద్యమకారులకు మద్దతుగా డప్పు కళాకారులు వివిధ భంగిమల్లో నృత్యాలుచేసి నిరసన తెలిపారు. దీంతో సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలు రామకృష్ణ, మధు తదితరులు వారి వద్ద నుంచి డప్పులు తీసుకుని కొద్దిసేపు మోగించారు.
మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారు: సీపీఐ రామకృష్ణ
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. 13 జిల్లాల్లోనూ జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర రహదారులన్నింటినీ ప్రజలు దిగ్బంధించి తమ ఆగ్రహాన్ని వెళ్లబుచ్చారని స్పష్టం చేశారు. హోదా ఇస్తామని గతంలో వెంకయ్యనాయుడు ప్రకటించారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఉప రాష్టప్రతి పదవికి రాజీనామా చేసి స్వర్ణ్భారత్ ట్రస్టును నడుపుకోవాలని సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రానికి హోదా ప్రకటించాలని, విభజన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. రెండు గంటలపాటు రాష్టవ్య్రాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధనంతో కేంద్రానికి సంకేతం అందజేశామన్నారు. సినీనటుడు శివాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలుచేసేంతవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
చిత్రాలు..హోదా కోసం రాజమండ్రిలో జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న దృశ్యం
*విజయవాడ కనకదుర్గమ్మ వారధిపై నిలిచిన వాహనాలు