రాష్ట్రీయం

దేనికైనా సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: ఆర్థిక నేరస్థులకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) గస్తీ కాస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. తాను దేనికైనా రెడీ అని, రాష్ట్రానికి హోదా ఇచ్చి తీరాల్సిందేనని, ఆత్మగౌరవం కాపాడుకోవావని వ్యాఖ్యానించారు. బీజేపీకి అధిష్ఠానం ఢిల్లీలో ఉందని, కానీ తనకు ఐదు కోట్ల ప్రజలే అధిష్ఠానమని స్పష్టం చేశారు. రాష్ట్ర శాసన మండలిలో గురువారం సాగు నీటి ప్రాజెక్టులపై స్వల వ్యవధి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పీఎంవోలో ఎంపీ విజయసాయి రెడ్డి దాక్కోవడం, తదితర వ్యవహారాలు వెలుగు చూశాయని, ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని బోనులో ఎక్కించే వరకూ తాను అక్కడే ఉంటానని విజయసాయి రెడ్డి ఈ వ్యవహారం బయటపడ్డాక చెబుతున్నారన్నారు. అక్కడే కాపురం పెట్టండి అంటూ ఎద్దేవా చేశారు. తన దగ్గరకు అలా ఎవరైనా వస్తే, రానివ్వబోనని తెలిపారు. గతంలో సీబీఐ మాజీ డైరెక్టర్‌పై ఇలాంటి సందర్భంలోనే కేసు పెట్టారని గుర్తు చేశారు. పట్టిసీమ, పోలవరంపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నదుల అనుసంధానంపై తాను అప్పటి ప్రధాని వాజపేయికి చెప్పానని, టాస్క్ ఫోర్సు వేసి మధ్యలో వదిలిపెట్టేశారన్నారు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడిగా అభివర్ణించారు. విభజన కోరుకున్నారు కనుక, ప్రాజెక్టు వచ్చిందంటూ లింక్ పెడుతున్నారని ఆరోపించారు. తెలుగు జాతి మధ్య చిచ్చుపెడుతూ, కోరుకున్నారంటూ చెబుతూ తమ దురుద్దేశాన్ని బయటపెట్టుకున్నారన్నారు. విభజన చేస్తున్న విధానం తప్పు అని, ఇద్దరికీ న్యాయం చేయమని చెప్పిఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావని ఆరోపించారు. పోలవరానికి అన్ని అనుమతులను తీసుకువస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం భూసేకరణ, పునరావాసంలో కేంద్రానికి బాధ్యత లేదా?
అని ఆవేశంగా ప్రశ్నించారు. పోలవరానికి సంబంధించి వివిధ అంశాల్లో రోజు రోజుకో మార్పు తెస్తూ, బిగిస్తున్నారన్నారు. ‘మీకు ఇచ్చి ఉంటే ఈ ప్రాజెక్టు ప్రారంభం కూడా అయ్యేది కాదు’ అంటూ ధ్వజమెత్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో అడ్డంకులు సృష్టించారని, రైతులను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇప్పుడు పట్టిసీమ గురించి మాట్లాడుతున్నారన్నారు. చట్టం ప్రకారం చెప్పింది చేయకపోతే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కుట్రలతో ప్రాజెక్టు పూర్తి చేయరా? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కేంద్రం నుంచి 2723 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, 1400 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి సమాచారం వచ్చిందన్నారు. దేశంలోని 11 జాతీయ ప్రాజెక్టులు పూర్తి కాలేదని, ప్రస్తుతం పోలవరానికి కేటాయిస్తున్న తీరున నిధులు కేటాయిస్తే పూర్తయ్యేందుకు ఒక దశాబ్దం పడుతుందన్నారు. తాను రాష్ట్రం కోసం ప్రాజెక్టును తీసుకున్నానని, కొంతమంది తన కోసం తీసుకున్నట్లు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. తాను ఏ రోజూ లాలూచీ పడలేదన్నారు. రాష్ట్రానికి భరోసా, కరవు ఎదుర్కొనే సత్తా వస్తుందని భావించానన్నారు. పట్టిసీమపై ఆరోపణలు చేశారని, కోర్టుకు కూడా వెళ్లారన్నారు. అనేక ఆరోపణలు చేసినప్పటికీ, కోర్టు ఆ పిటిషన్లను కొట్టివేసిందని గుర్తు చేశారు. అది రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడేవారికి చెంపపెట్టని వ్యాఖ్యానించారు. స్పష్టమైన తీర్పు వచ్చాక కూడా ఆరోపణలు చేస్తే ఏలా అని ప్రశ్నించారు. పట్టిసీమ నీళ్లు ఇచ్చామని, సామాన్యుడికి దురుద్దేశం లేకపోవడంతో కృతజ్ఞతగా ఉంటారని, కానీ దురుద్దేశం ఉండటంతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ గురించి గందరగోళంగా మాట్లాడుతున్నారని, కేంద్రానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జనసేన నేతను బీజేపీ కూడా సమర్థిస్తోందని, ప్రాజెక్టును స్వార్థం కోసమే తీసుకున్నానని, భూసేకరణ గురించి చెప్పారని పవన్ అంటున్నా, బీజేపీ మాట్లాడిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రానికి సాయం చేస్తుందని ఆశతో ఢిల్లీ 29 సార్లు వెళ్లానని, కానీ పుండు మీద కారం చల్లారన్నారు. రెవెన్యూ లోటు భర్తీ అవసరమైనప్పుడు ఇవ్వకుంటే ఎలా అన్నారు. రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు సరిపోతాయా.. వేరే రాష్ట్రాలకు ఎలా భారీగా నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. అక్కడ ఎన్నికలు ఉన్నాయని ఇచ్చారా అని ధ్వజం ఎత్తారు. మనకు అర్హత లేదా.. అడిగితే ఎగతాళి చేస్తారా.. ప్రజలకు కోరికలు ఉండవా.. అని ప్రశ్నించారు. హోదా ఎవరికీ ఇవ్వడం లేదంటూ, నాలుగు సంవత్సరాలుగా పైసా ఇవ్వలేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నట్లుగా 90-10 విధానంలో మనకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోతే బాధ వేసిందన్నారు. బోనులో ఎక్కిస్తారట. తాను దేనికైనా రెడి అని సవాల్ చేశారు. లోకేష్ తన కొడుకైనా పరిపాలనలో జోక్యం ఇష్టం లేదన్నారు. తనకేమీ భయం లేదని, విభజన హామీలు ఎన్ని అమలు అయ్యాయో చర్చ చేద్దామన్నారు. తన కోర్కెలు రీజనబుల్‌గా లేవని చెప్పండి, దేశాన్ని అర్థం చేసుకోనివ్వండన్నారు. చాలా ఇచ్చామంటూ రాష్ట్రంపై ఎదురుదాడి చేస్తే ఎలా అన్నారు. హాదా హక్కని, తనకు ప్రజలే అధిష్ఠానమన్నారు.