రాష్ట్రీయం

బీజేపీకి నాగం గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగర్‌కర్నూలులోని తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు మెయిల్‌లో పంపించినట్టు తెలిసింది. అయితే నాగం పార్టీ వీడటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సంప్రదాయానికి భిన్నంగా బీజేపీ నాగం జనార్ధనరెడ్డికి అధిక
ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాగం పార్టీ వీడారని, టీఆర్‌ఎస్ అవినీతిపై బీజేపీ పోరాటం చేయడం లేదన్న నాగం ఆరోపణలను లక్ష్మణ్ కొట్టిపారేశారు.
గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. చాలా అంశాల్లో ఆయన అభిప్రాయాలను పార్టీ పక్కన పెట్టడం, ఆయన లేవనెత్తిన అంశాలపై పార్టీ భిన్నంగా స్పందించడంతో నాగం కినుక వహించారు. తెలంగాణలో మిషన్ భగీరథ టెండర్లలో అవినీతి అక్రమాలపై నాగం తరచూ ప్రస్తావించడాన్ని కూడా పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోయింది. కొన్ని మార్లు టీఆర్‌ఎస్‌ను దుమ్మెత్తిపోసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నాగంకు హితవుచెప్పినట్టు కూడా తెలిసింది. 2013లో భాజపాలో చేరిన నాటి నుండి ఆయన సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకోవడం లేదనే భావనను ఎప్పటికపుడు తన సన్నిహితుల వద్ద వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం అప్పట్లో ఊపందుకుంది. దీనిని సమర్ధిస్తూ ఆయన బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం నుండి ఆయన కార్యకర్తలతో పార్టీని వీడే విషయంలో మంతనాలు జరిపి వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్‌లో చేరితే బావుంటుందని ఎక్కువ మంది కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిసింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరే విషయంపై ఇంకా నాగం స్పష్టత ఇవ్వలేదు. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక భూమికను పోషించిన నాగం జనార్ధనరెడ్డి వైద్య ఆరోగ్యమంత్రిగా అనేక మంచి నిర్ణయాలను తీసుకున్నారు. నాగర్‌కర్నూలు నుండి ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన తెలుగు దేశం పార్టీని వీడి తెలంగాణ నగారా పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. 2013లో ఆపార్టీని బీజేపీలో విలీనం చేశారు. అప్పటి నుండి ఆయన తన కుమారుడితో కలిసి బీజేపీలో కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాగర్‌కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న శశిధర్‌రెడ్డి సైతం బీజేపీకి రాజీనామా చేశారు.
రాహుల్‌గాంధీతో భేటీ
బీజేపీని వీడే ఆలోచనలో ఉన్న నాగం జనార్ధనరెడ్డి గతంలో ఒకమారు రాహుల్ గాంధీతో భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి, అయితే ఆ వార్తలను ఆయన ధృవీకరించలేదు. తాజాగా ఆయన మరో మారు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి చర్చించి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ తీర్ధం ఎపుడు తీసుకుంటారనేది ఇంకా తేలాల్సి ఉంది.