రాష్ట్రీయం

ప్రజాతీర్పుకే అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, మార్చి 22: ప్రజలు ఓటేసి అసెంబ్లీకి పంపగా ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న శాసనసభ్యులను సస్పెండ్, రద్దుచేయడం ప్రజాతీర్పుకు అవమానమని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పార్లమెంట్‌లో, అసెంబ్లీలోగాని ఇలాంటి దుస్సంఘటన జరగలేదని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆయన గురువారం నేరేడుచర్ల మండలం నర్సయ్యగూడెం గ్రామంలో కాంగ్రెస్‌పార్టీ జెండాను ఆవిష్కరించి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్‌పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పార్టీకి 33శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 24శాతం ఓట్లు రాగా ప్రభుత్వానికి 67శాతం వ్యతిరేకంగా ఓట్లు వచ్చినట్టు, ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తరువాత ఇతర పార్టీల శాసనసభ్యులను కొనుగోలు చేయడం, కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజాసమస్యలపై నిలదీసిన శాసనసభ్యులను,
ప్రలోభాలకు లొంగని శాసనసభ్యులపై కుట్రపన్ని అప్రజాస్వామికంగా సస్పెండ్, రద్దుచేయడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రైతుల రుణమాఫీ సందర్భంగా వడ్డ్భీరం ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశంలో చెప్పినప్పటికీ వడ్డ్భీరం రైతులపై వేయడాన్ని ప్రశ్నించినందుకు, దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూపంపిణీ అమలుకాని విషయాన్ని ప్రశ్నించినందుకు, ఎన్నికల్లో ఇచ్చిన డబుల్‌బెడ్‌రూంలు పేదలకు అందలేదని ప్రశ్నించినందుకు, మహిళాసంఘాల రుణాలపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శాసనసభ్యులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ చరిత్రలో మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి ప్రజల తీర్పును అగౌరవపరిచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎద్దేవాచేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు కమీషన్ల పథకాలని విమర్శించారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్లకార్డులు పటుకొని నిలదీయవచ్చుకాని గవర్నర్ ప్రసంగాలు అబద్ధాలుగా ఉండడాన్ని ప్రశ్నించినందుకు సస్పెండ్ చేయడం అసమంజసం అన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నించవచ్చుకాని అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 6లక్షల సమభావన సంఘాలు ఉన్నాయని, 70లక్షల సభ్యులు ఉన్నారని, వీరికి ప్రస్తుత ప్రభుత్వం అభయ హస్తం అందించడం లేదని, 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారం చేపడుతుందని తక్షణమే ప్రతి సంఘానికి రూ.లక్ష గ్రాంట్ రూ.10లక్షల రుణం ఇచ్చి వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని, గతంలో ఇచ్చిన రూ.500 అభయహస్తం పెన్షన్‌ను రూ.1000కు పెంచుతామని, భవనాలు లేని సంఘాలకు భవనాలు నిర్మిస్తామని, వీఎఓలకు రూ.3వేల నుండి రూ.10వేలకు వేతనాలు పెంచుతామని, ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ధాన్యం కొనుగోలుకు బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయిస్తామని, పంటబీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, వరికి రూ.2వేలు, పత్తికి రూ.6వేలు, మిర్చికి రూ.10వేలు, పప్పు ధాన్యానికి రూ.7వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైందన్నారు. తమొదట మండల కేంద్రమైన నేరేడుచర్లలోని నర్సయ్యగూడెం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం చినవెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్‌యాదవ్, రాష్ట్ర నాయకుడు జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గరిడేపల్లి మండల అధ్యక్షుడు పైడిమర్రి రంగనాధ్, గరిడేపల్లి జడ్పీటీసీ పెండెం శ్రీను, నేరేడుచర్ల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు, నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నక్క రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నల్లగొండ జిల్లాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి