రాష్ట్రీయం

నిఘా నీడలో కల్యాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 22: భద్రాచలంలో రాములోరి కల్యాణం ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నది. సీతారామచంద్రుడు విళంబినామ సంవత్సరంలోనే జన్మించాడని, ఈ ఏడాది కూడా విళంబి నామ సంవత్సరమే కావడం శుభసూచకమని, కల్యాణాన్ని వీక్షిస్తే శుభం జరుగుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది కల్యాణానికి లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే కల్యాణ వేడుకంతా గతానికి భిన్నంగా పూర్తిగా నిఘా నీడలోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. సెక్టార్లను విభజించి అందుకు అనుగుణంగా ఉన్నత స్థాయి అధికారిని ఆ సెక్టార్‌కు బాధ్యుడుగా చేస్తూ నియమించనున్నారు. 40కి పైగా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ సిబ్బందిని కూడా అధిక మొత్తంలో ఈ సారి వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి రెండురోజుల పాటు భద్రాచలంలోనే ఉండటం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుండటం, మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్న నేపథ్యంలో విస్తృత బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల భద్రాచలం సమీపంలోనే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు హతం కావడం, కొద్దిరోజులుగా మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న క్రమంలో బుధవారం కూడా మావోయిస్టులకు బాంబులను సరఫరా చేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద నుంచి భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్యలు తప్పవని మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. లోక కల్యాణంగా జరిగే ఈ వేడుక ఈ నెల 26న జరగనుండగా 27న శ్రీరామ పట్ట్భాషేకం జరగనున్నది. ఈ రెండు వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు చిన్నజీయర్ స్వామి హాజరవుతుండగా పట్ట్భాషేకానికి గవర్నర్ నరసింహన్ హాజరవుతున్నారు. వీరి భద్రత కోసం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా నేతృత్వంలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, భూపాలపల్లి జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ భద్రాచలంలోనే మకాం వేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు విస్తృతంగా కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. శనివారం ఉదయం నుంచే భద్రాచలం పట్టణాన్ని పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. కల్యాణ ఏర్పాట్లలో భాగంగా ముందుగానే సెక్టార్ల విభజన పూర్తయింది. సెక్టార్ల వారీగా బందోబస్తు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్రం..భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేసిన సెక్టార్లు