రాష్ట్రీయం

సమాజానికి మేలుకొలుపు.. ‘ప్రపంచం నీ గుప్పెట్లో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 22: కుటుంబం మధ్య ఆత్మీయతలు అంతర్జాలానికి పరిమితమైపోతున్నాయి.. పెరిగిన సాంకేతికత కుటుంబ బంధాలను తెంచేస్తోందని సమకాలీన కుటుంబాల్లోని పరిస్థితులను కథా వస్తువుగా తీసుకుని ప్రస్తుత సామాజిక విశృంఖలత్వాన్ని చక్కగా ఆవిష్కరించింది ‘ప్రపంచం నీ గుప్పెట్లో’ నాటిక. మారుతున్న కాలానికి అనుగుణంగా భర్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తే తప్ప కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి లేదని చెబుతూనే మానవ సంబంధాలు ఏ విధంగా నాశనమవుతున్నాయో వివరిస్తూ ఈ నాటకం సందేశాత్మకంగా సాగింది. ప్రేక్షకులను కంట తడిపెట్టించిన ఈ నాటకంలో నటులంతా తమ తమ పాత్రలకు జీవంపోశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కళావాణి సంస్థ ఈ నాటికను ప్రదర్శించింది. రేలంగి మల్లిక్ రచించగా, ఆర్ ఉదయభాస్కర్ దర్శకత్వం వహించారు. తెరతీసిన వెంటనే పాత ఇల్లు, రేడియో వార్తలు, కట్టెలు పొయ్యపై వంట చేయడం వంటి సన్నివేశాలతో మొదలయ్యే నాటిక రెండో అంకంలో ఆధునిక కాలానికి తగిన ఇంటి సెట్టు వేసి అందులో సమకాలీన కుటుంబ వ్యవస్థను సందేశాత్మకంగా రక్తి కట్టించారు. నాన్నమ్మ, అమ్మమ్మలకు దూరంగా చిన్న చిన్న కుటుంబాలైపోయిన నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న కుటుంబాల పిల్లలకు నాన్నమ్మ కథలు స్కైప్‌లో చెప్పడం వినూత్నంగా సమాజాన్ని మేలుకొలిపేదిగా అనిపించింది. ఆంధ్రా నుంచి అమెరికాలో పిల్లలకు నాన్నమ్మ కథలు చెప్పడం ఆలోచింపజేసింది. తల్లిదండ్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే మమతలు దూరం అవుతాయని, వాస్తవాలు గ్రహించకుండా కరెన్సీకే విలువిచ్చి మనిషికి విలువ ఇవ్వని స్థితిలో ఇంటర్నెట్ అంతర్జాలం భవబంధాలను విచ్ఛిన్నం చేస్తోందని మొత్తంగా ఈ నాటిక సందేశాన్నిచ్చింది. ఈ నాటికకు ప్రదర్శనా పారితోషికాన్ని ఎఫ్‌డీసీ తరపున సమాచార శాఖ డిఎల్‌పివో జీ వెంకటేశ్వరరావు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి జరుగుతున్న నంది నాటకోత్సవం ప్రదర్శనలు గురువారంతో ముగిశాయి. ముగింపు రోజు ‘ప్రపంచం నా గుప్పెట్లో నాటికతోపాటు ధవళేశ్వరం వాసవి కళానికేతన్ కల్చరల్ అసోసియేషన్ వారి ‘్భక్త రామదాసు’ నాటిక ప్రదర్శించారు. ఈ నాటిక దివంగత పి కోటేశ్వరరావు రచించగా బి నర్శింహమూర్తి దర్శకత్వం వహించారు. మూడో ప్రదర్శనగా ఏలూరు అభినయ నృత్య భారతి ఆధ్వర్యంలో ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ అనే నాటిక ప్రదర్శించారు. దివంగత దాసం గోపాలకృష్ణ రచించిన ఈ నాటికకు మర్రాపు మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు. చివరి ప్రదర్శనగా జంగారెడ్డిగూడెంకు చెందిన మీ.కో.స.మె. సంస్థ సమర్పించిన ‘జాగా’ నాటిక ప్రదర్శించారు. రచన, దర్శకత్వం డాక్టర్ బొక్కా శ్రీనివాసరావు. ఎంపీ మాగంటి మురళీమోహన్ సారధ్యంలో ఏపీ చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగిన నాటకోత్సవాలకు 42 ప్రదర్శనలు ఎంపికయ్యాయి. అనివార్య కారణాలవల్ల ఏడు ప్రదర్శనలు రద్దుకాగా 35 మాత్రమే ప్రదర్శించారు.

చిత్రం..‘ప్రపంచం నీ గుప్పెట్లో’ నాటికలో ఓ సన్నివేశం