రాష్ట్రీయం

నిర్మాత, దర్శకుడు దశరథ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: ప్రముఖ నిర్మాత, పంపిణీదారు డు, దర్శకుడు సంగిశెట్టి దశరథ (66) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గ త కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం సికింద్రాబాద్ బోయన్‌పల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శివాజీ గణేశన్, రాధ నటించిన ‘ఆత్మబంధువు’ చిత్రంతో దర్శరథ సినిమా రంగంలోకి ప్రవేశించారు. ‘ఖైదీవేట’తో నైజాం ప్రాంతంలో పంపిణీ సంస్థను ప్రారంభించి అనేక చిన్న చిత్రాలను విడుదల చేశా రు. ఇంద్రధనస్సు, పిల్లలు దిద్దిన కాపురం, టార్గెట్ చిత్రాలను భాగస్వాములతో నిర్మించారు. ‘టైంపాస్’ చిత్రానికి దర్శక త్వం వహించారు. శుక్రవారం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో ఆయనకు చిత్రపరిశ్రమ శ్రద్ధాంజలి ఘటించనుంది.