రాష్ట్రీయం

సంక్షేమ నిధుల కేటాయింపుల్లో తెలంగాణ ఫస్ట్.. రెండోస్థానంలో ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి నిధులు కేటాయించడంలో పోటీపడుతున్నాయి. 2017-18లో ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో 10 శాతం, ఆంధ్ర రాష్ట్రం 8 శాతం నిధులు కేటాయించాయి. సంక్షేమ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన తరగతుల సంక్షేమం ఉన్నాయి. దేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఆంధ్ర, మూడవ స్థానంలో కర్నాటక ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్‌లో 5.1 శాతం నిధులు సంక్షేమానికి కేటాయించింది. పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి ఆర్గనైజేషన్స్ స్టేట్ నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. శాఖల వారీగా విశే్లషిస్తే గిరిజనుల సంక్షేమానికి నిధులను తెలంగాణ ఇతోధికంగా పెంచింది. 2017-18లో రూ.5903 కోట్లను కేటాయిస్తే, 2018-19లో రూ.8063 కోట్ల నిధులను కేటాయించారు. ఆంధ్రాలో వెనకబడిన తరగతుల సంక్షేమానికి 2017-18లో రూ. 4246 కోట్లు, వచ్చే ఏడాది బడ్జెట్‌లో 18.1 శాతం ఎక్కువగా అంటే, రూ.5014 కోట్ల నిధులను కేటాయించారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ రంగానికి తక్కువగా నిధులు కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం సంక్షేమానికి సంబంధించి 0.2 శాతం కేటాయించింది. కాగా చాలా రాష్ట్రాల్లో ఇరిగేషన్, వ్యవసాయంలో ప్రత్యేక సంక్షేమ పథకాలను చూపిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణలో మాదిరిగా వివిధ వర్గాల వారీగా నిధులను కేటాయించే సంప్రదాయం తక్కువే. హర్యానా ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఒబిసి సంక్షేమానికి 0.8 శాతం, చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఒక శాతం, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు కూడా స్వల్పంగానే సంక్షేమానికి నిధులు కేటాయించాయి. తమిళనాడు ప్రభుత్వం 2.2 శాతం నిధులను వివిధ పథకాలకు కేటాయిస్తోంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబిసిల సంక్షేమానికి నిధుల కేటాయింపు తెలంగాణ, ఆంధ్ర, కర్నాటకలో ఎక్కువ.
తెలంగాణ రాష్ట్రం సాంఘిక సంక్షేమానికి రూ.3172 కోట్లు, 2017-18లో 10064 కోట్లు కేటాయించారు. 2018-19లో రూ.12709 కోట్లను కేటాయించారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే 26 శాతం ఎక్కువగా నిధులు కేటాయించారు. బిసి సంక్షేమానికి 2016-17లో రూ.2832 కోట్లు, 2017-18లో రూ. 4970 కోట్లు ఖర్చుపెట్టారు. 2018-19లో రూ.5920 కోట్లు కేటాయించారు. గతంలో ఉన్న బడ్జెట్‌తో పోల్చితే 19 శాతం నిధులు ఎక్కువగా కేటాయించారు.
తెలంగాణ ప్రభుత్వం 2017-18లో ఇరిగేషన్‌కు 17.6 శాతం నిధులను, ఆంధ్ర 8.99 శాతం నిధులను, ఒడిశా 8.8 శాతం, కర్నాటక 8.6 శాతం నిధులు కేటాయించాయి. అప్పులపై విశే్లషిస్తే మొత్తం జిఎస్‌డిపిలో ఢిల్లీ రాష్ట్రానికి ఆరు శాతం, చత్తీస్‌గఢ్‌కు 16 శాతం, తెలంగాణ, కర్నాటకకు 17 శాతం, మహారాష్ట్ర, ఒడిశాకు 18 శాతం వాటా ఉంది.