రాష్ట్రీయం

రాజకీయాల్లోకి లక్ష్మీనారాయణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: సిబిఐ మాజీ జాయింట్ డైరక్టర్ (జెడి), మహారాష్ట్ర పోలీస్ శాఖలో ప్రస్తుతం అదనపు డిజి హోదాలో పని చేస్తున్న లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్)కు దరఖాస్తు చేశారు. రాజీనామా లేఖను ఆ రాష్ట్ర డిజిపికి అందజేశారు. ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం విఆర్‌ఎస్‌కు అనుమతించాల్సి ఉంది. స్వచ్ఛంధ ఉద్యోగ విరమణ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారని సమాచారం. అయితే ఇంకా ఏ పార్టీలో చేరేది ఆయన వెల్లడించకపోయినప్పటికీ బిజెపిలో గానీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో గానీ చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన ఐపిఎస్ సర్వీస్ నుంచి విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారనే సమాచారం వెల్లడి కావడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన పూర్తి పేరు వివి లక్ష్మీనారాయణ అయినప్పటికీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణగానే అందరికీ గుర్తుండిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన సిబిఐ జాయింట్ డైరక్టర్‌గా పని చేసి చాలా సంచలన కేసులు నమోదు చేశారు. సిబిఐ పనితీరు విధానాన్ని ప్రజలకు తెలియజేశారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసుతో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులను నమోదు చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. సత్యం కంప్యూటర్ కేసుతో పాటు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి, తదితరులు, ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి తదితరులను అరెస్టు చేయడం అప్పట్లో తీవ్ర సంచలనం రేకిత్తించింది. విధి నిర్వహణలో తనదైన శైలిలో పని చేయడం ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ కేసుల నమోదు, అరెస్టుల పర్వం కొనసాగిన కొన్ని రోజుల తర్వాత ఆయనను సిబిఐ నుంచి సొంత క్యాడర్ రాష్టమ్రైన మహారాష్ట్ర పోలీస్‌కు బదిలీ అయ్యారు. అక్కడ వివిధ హోదాల్లో పని చేసిన లక్ష్మీనారాయణ వీలు దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన హయాంలో నమోదు చేసిన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోర్టు ఆదేశాలతో ఈడి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును ఉపసంహరించుకున్న సమయంలో లక్ష్మీనాయణపై సోషల్ మీడియాలో విమర్శల దాడి చేశారు. వైఎస్‌ఆర్‌సిపి, జగన్ అనుచర గణం ఆయనపై పెద్ద ఎత్తున మాటల దాడి చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఆయన విఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.