రాష్ట్రీయం

జగన్‌కు ఇడి సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో మార్చి 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఈ అక్రమాస్తుల కేసులో ఉన్న మరో పది మందికి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. విజయసాయిరెడ్డి, అరబిందో, హెటిరో ఫార్మా యాజమాన్యం ప్రతినిధులు, ఏపిఐఐసి మాజీ జిఎం, హెటిరో హెల్త్ సంస్ధలతో కలిపి పది మందికి సమన్లు జారీ చేశారు. ఇదే కేసులో తమకు ఇడి సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ దాల్మియా సిమెంట్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. ఈ కేసులో దాల్మియా సిమెంట్స్ తరఫున కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హైకోర్టులో వాదించారు. సిబిఐ ప్రత్యేక కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఉండగా, అదే కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తూ చిదంబరం ఇటీవల హైకోర్టులో వాదించారు.

రాజమహేంద్రవరంలో
బిజెపి సంకల్ప సభ
ప్రజల ముందు కేంద్ర నివేదిక
రాష్ట్రంలో మూడు సభల నిర్వహణకు నిర్ణయం
టిడిపి తప్పుడు ప్రచారంపై వివరణకు సిద్ధం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 18: భారతీయ జనతా పార్టీ రాష్టశ్రాఖ మార్చి 6న ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిజెపి సంకల్పం ’ పేరు మీద భారీ బహిరంగ సభను రాజమహేంద్రవరంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు బిజెపి యువమోర్చా అధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన రెడ్డి తెలిపారు. గురువారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం బహిరంగ సభకు సంబంధించి ముఖ్య నాయకుల సమావేశాన్ని 16న నిర్వహించినట్టు వెల్లడించారు. చలో రాజమహేంద్రి పేరుతో దీనిని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాలతో ఆంధ్రాలో పార్టీకి 40 లక్షల సభ్యత్వానికి ప్రయత్నించి 37 లక్షల సభ్యత్వం చేశామని చెప్పారు. రాష్ట్రంలో మూడు చోట్ల భారీ బహిరంగ సభల్లో భాగంగా తొలి సభ రాజమహేంద్రిలో నిర్వహిస్తామని, దీనిలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, జాతీయ కార్యదర్శులు పాల్గొంటారని అన్నారు. 19 మాసాల్లో ఆంధ్రాలో చేసిన అభివృద్ధి, బిజెపి సంకల్పం ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం ఈ సభ ద్వారా చేస్తామని చెప్పారు. 18 మాసాల్లో పెద్దఎత్తున నిధులు ఇచ్చిన ఏకైక కేంద్ర ప్రభుత్వం తమదేనని ఆయన అన్నారు. కేంద్రం అంకిత భావాన్ని లెక్కలతో సహా చెబుతామని వివరించారు. రాజధాని నిర్మాణం, విభజన బిల్లులో ఇచ్చిన హామీలు అమలు, విభజన బిల్లులో ఇవ్వని హామీలు గురించి, విద్యుత్ సరఫరా ఇతర అంశాలను ప్రజల ముందు రిపోర్టు మాదిరి అందజేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కేంద్రం చేయబోయే అభివృద్ధి సంకల్పాన్ని కూడా ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. ఎపిలో బిజెపి నూతన కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తయిందని, జిల్లా, మండల అధ్యక్షుల నియామకం కూడా పూర్తయిందని, ఈ మూడు సభల తర్వాత మరింత చైతన్యవంతంగా పనిచేయనున్నాయని అన్నారు.

మార్కెట్ కమిటీల గడువు పొడిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది క్రితం ఏర్పాటైన 28 మార్కెట్ కమిటీల గడువు మరో ఆరునెలలు పొడిగించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి టి. విజయ్‌కుమార్ పేరుతో గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పొడిగించిన మార్కెట్ కమిటీలు: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, పరమనేరు, అనంతపురం జిల్లాలోని మడకశిర, కడప జిల్లాలోని కడప, కమలాపురం, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, నంద్యాల, ధోన్, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కావలి, ప్రకాశం జిల్లాలోని కొండపి, కృష్ణాజిల్లాలోని నందిగామ, కంచికచర్ల, పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు, పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లాలోని నగరం, తాళ్లరేవూరు, ప్రత్తిపాడు, ముమ్మిడివరం, ఆలమూరు, పీఠాపురం, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మార్కెట్ కమిటీలు ఉన్నాయి.