రాష్ట్రీయం

పాడినపాటే పాడుతున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వామపక్షాలతో కలిసి త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సుదీర్ఘ లేఖ రాయడం, దానికి ప్రతిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అంతే సుదీర్ఘంగా జవాబు ఇవ్వడం చూస్తుంటే ప్రత్యక హోదా బీజేపీ ఎప్పటికీ ఇవ్వదని, దానిని సాధించే స్థితిలో తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం లేదన్న సంగతిని ప్రజలు మరింత అర్ధం చేసుకున్నారని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. వేలాది కోట్ల రూపాయిలను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చామని, వాటిని ఖర్చు చేయడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని పవన్ వ్యాఖ్యానించారు. పాడిన పాటనే అమిత్ షా మళ్లీ పాడుతున్నారని, అదే మాదిరిగా ఎప్పటిలా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ అన్యాయం చేసిందని మరోసారి ఘోషించారని పవన్ దుయ్యబట్టారు. ఎందుకు ఈ దాగుడు మూతలు ఆడుతున్నారు? భారత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ ఎంత ఖర్చుచేసిందో ఇరు ప్రభుత్వాలకు చెందిన అధికారులను కమిటీగా వేసి లెక్కలు కట్టి ప్రజలకు తెలియజేయవచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. జనసేన చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫ్యాక్టు ఫైండింగ్ కమిటీ అధ్యయనంలో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకుని యూనియన్ గవర్నమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిలయదీయవచ్చు కదా? అని అన్నారు.
విసిగి వేసారిన ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరవధిక ఆందోళనలు దిగే పరిస్థితులు దయచేసి కల్పించవద్దని జనసేన పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన వాటి గురించి వినే స్థితిలో ప్రజలు లేరనే యదార్థాదన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిదని అన్నారు.
బీజేపీ , తెలుగుదేశం పార్టీల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన అనిశ్చితి పరిస్థితిపై చర్చించడానికి త్వరలో వామపక్షాలతో చర్చలు జరపుతామని అన్నారు. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తామని అన్నారు. తర్వాత లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ వంటి అనుభవజ్ఞులతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మేథాలవులతో సమాలోచనలు చేస్తామని ఆయన తెలిపారు.