రాష్ట్రీయం

లొంగిపోయన మిలీషియా కమాండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, మార్చి 24: ఒడిసా రాష్ట్రానికి చెందిన మావోయిస్టు మిలీషియా కమాండర్, ఇద్దరు మిలీషియా సభ్యులు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీ అజిత ముందు శనివారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మిలీషియా కమాండర్ మడికి నగేష్ 2010లో మిలీషియా సభ్యునిగా చేరి, కమాండర్‌గా ఎదిగాడన్నారు. 2012లో రంగయ్యగూడెంలో తుకుడా అనే వ్యక్తిని హతమార్చిన ఘటనలో, 2014లో పిడిమెల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో పాల్గొన్నాడన్నారు. అలాగే మడికి రాజు, ముచ్చిక ఎర్ర (వీరిద్దరూ) మిలీషియా సభ్యులుగా పనిచేస్తూ నగేష్‌కు సహకరించేవారన్నారు. వీరి ముగ్గురు ఒడిస్సా రాష్ట్రంలోని సుకుమా జిల్లా పిడిమల్ గ్రామానికి చెందినవారన్నారు. మావోయిస్టులు అనుసరిస్తున్న విధానాలు నచ్చక, కుటుంబ సభ్యుల వత్తిడితోపాటు ఇప్పుడు పోలీసులు అనుసరిస్తున్న విధి విధానాలు నచ్చి వారంతట వారుగా లొంగిపోయినట్లు ఏఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఏఓబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎప్పటికప్పుడు కూంబింగ్‌లు నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామన్నారు. గిరిజనులు మావోయిజం వైపునకు వెళ్లకుండా పలు కార్యక్రమాలు చేబడుతున్నామన్నారు. విలేఖరుల సమావేశంలో మారేడుమిల్లి సీఐ రవికుమార్, గుర్తేడు ఎస్సై నాగేశ్వరరావు, సిబ్బంది ప్రసాద్, ప్రతాప్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..లొంగిపోయిన మిలీషియా కమాండర్, సభ్యులను చూపిస్తున్న ఏఎస్పీ అజిత