రాష్ట్రీయం

అడ్రస్‌ లేని పీసీపీఐఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 24: పెట్రోలియం అండ్ కెమికల్ పెట్రో ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) అడ్రస్ దాదాపుగా గల్లంతయ్యింది. విశాఖ-కాకినాడ మధ్య పీసీపీఐఆర్ ఏర్పాటవుతుందని ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన పారిశ్రామిక వర్గాల ఆశలన్నీ ఆవిరయ్యాయి. పీసీపీఐఆర్ పరిస్థితీవిధంగా ఉంటే కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్) పరిస్థితీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం కోస్తా జిల్లాల వెంబడి కోస్టల్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత కాకినాడ-విశాఖ తీరం మధ్య పెద్ద ఎత్తున భూసేకరణ జరిగింది. ఇదే సమయంలో తీర ప్రాంత గ్రామాల ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. మత్స్యకార గ్రామాల ప్రజలు కోస్టల్ కారిడార్‌కు వ్యతిరేకంగా అప్పట్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ప్రజా ఉద్యమాల నేపథ్యంలో కోస్టల్ కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా పీసీపీఐఆర్‌ను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తొలి విడతగా విశాఖ-కాకినాడ మధ్య పీసీపీఐఆర్‌ను నెలకొల్పుతామని స్పష్టంచేశారు. ప్రజలకు, పర్యావరణానికి ఏ మాత్రం విఘాతం కలుగని రీతిలో పెట్రోకెమికల్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. పీసీపీఐఆర్ పేరుతో విశాఖ-కాకినాడ మధ్య పెద్ద ఎత్తున భూములను సేకరించారు. ఇదే సమయంలో కాకినాడలో ఎస్‌ఇజడ్ నిర్మాణానికి సుమారు 10వేల ఎకరాలు సేకరించారు. వైఎస్ మృతి అనంతరం అటు పీసీపీఐఆర్, ఇటు కేఎస్‌ఇజడ్‌లపై రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు దృష్టిసారించలేదు. ఇదే సమయంలో పీసీపీఐఆర్, కెఎస్‌ఈజడ్‌లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల ప్రాణాలకు హాని కలిగించే రసాయనిక పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులివ్వమని, వివాదాస్పద ఎస్‌ఈజడ్ భూ సమస్యను పరిష్కరిస్తామని 2014 ఎన్నికలకు ముందు నిర్వాసితులకు, బాధితులకు హామీలిచ్చారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ రెండు సమస్యలను పరిష్కరించకపోగా కనీసం దృష్టి సారించే తీరిక ఆయనకు లేదని కేఎస్‌ఈజడ్ వ్యతిరేక పోరాట సమితి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పేదల భూముల్లో ‘రియల్ వ్యాపారం’
తీర ప్రాంతంలో పీసీపీఐఆర్, కేఎస్‌ఇజడ్‌ల కోసం సేకరించిన భూముల్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకాకపోగా, ఏ ఒక్కరికైనా ఉపాధి కల్పించ గలిగారా? అని ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక అవసరాల పేరుతో కాకినాడ తీర ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇది కాకుండా విశాఖ జిల్లా పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి తీర ప్రాంతం వెంబడి వేల ఎకరాలను సేకరించారు. సుమారు 17 సంవత్సరాల క్రితం ఈ భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాగా గతంలో ప్రభుత్వాలు ప్రకటించినట్టు ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటుకాలేదని పారిశ్రామిక వర్గాలు వాపోతున్నాయి.