రాష్ట్రీయం

స్వర్ణ్భారతి ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: స్వర్ణ్భారతి ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు మరిన్ని ఉద్భవిస్తే భారతదేశం స్వర్ణ్భారత్ కాగలదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుప్తుల కాలంలో భారతదేశంలో స్వర్ణయుగం నడిచిందని, మళ్లీ అలాంటి దేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతోనే స్వర్ణ్భారతి ట్రస్ట్‌ను ప్రారంభించినట్టు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణ్భారతి ట్రస్ట్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతు శిక్షణా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించగా వృత్తి శిక్షణా కేంద్రం భవనానికి వెంకయ్యనాయుడు భూమిపూజ నిర్వహించారు. సిఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ భారత ప్రదాని మోదీ ఇప్పుడు మేకిన్ ఇండియాను ప్రారంభించగా వెంకయ్యనాయుడు 15 ఏళ్లక్రితమే స్వర్ణ్భారతి ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపట్టారంటూ ప్రశంసించారు. ఏ రంగంలోనైనా నైపుణ్యం, టెక్నాలజీను వినియోగిస్తే అభివృద్ధి సాధ్యం కాగలదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ సాయం లేకుండా తమ ట్రస్ట్ ద్వారా గత 15 ఏళ్లలో 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. మహిళలు యువతకు ఉపాధి కల్పించడమే ఈ ట్రస్ట్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎంపిలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణరావు, మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, తదితరులు ప్రశంసించారు. ఆత్కూరు గ్రామ సర్పంచ్ కె.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులను గజమాలతో సత్కరించారు. తొలుత ప్రాంగణంలో కనిపించిన సరికొత్త బుల్లెట్ సిఎం చంద్రబాబునాయుడు నడిపారు.

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో
ఎన్‌ఎంయుకు ఆధిక్యత
శ్రీకాకుళం, విజయనగరంలో
ఇయు, విశాఖలో ఎన్‌ఎంయు
9 రీజియన్లలో ఏ యూనియన్‌కూ
గుర్తింపు లేని స్థితి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 18: రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో కార్మిక సంఘ గురువారం ఎంతో ప్రతిష్టాకరంగా జరిగిన ఎన్నికల్లో దాదాపు 152 పోలింగ్ కేంద్రాల్లో నీవా, నేనా అనే రీతిలో హోరాహోరీ పోరు సాగింది. రెండు సంఘాల మధ్య క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రివేళ తొలి ఫలితం వెలువడింది. మొత్తం 13 జిల్లాల్లోను 56,438 మంది ఓటర్లుండగా 54,533 ఓట్ల లెక్కింపుజరిగింది. ఇందులో 172 ఓట్లు చెల్లలేదు. రాష్టస్థ్రాయి గుర్తింపులో ఎన్‌ఎంయు కేవలం 173 ఓట్ల ఆధిక్యతతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక మిగిలిన 1732 పోస్టల్ బ్యాలెట్లపై ఈ రెండు యూనియన్ల భవితవ్యం ఆధారపడి వుంది. ఈనెల 23, 24 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 13 రీజియన్లలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 50 శాతం మించి ఓట్లు లభించినా ఇయు గుర్తింపు పొందగా విశాఖపట్నంలో ఎన్‌ఎంయు గుర్తుంపుసాధంచింది. మిగిలిన ఏ జిల్లాల్లోనూ ఏ యూనియన్‌కు కూడా 50 శాతంకు మించి ఓట్లు రాలేదు. దీంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన యూనియన్‌కే ఆయా జిల్లాల్లో గుర్తింపు లభిస్తుంది.
క్లాస్-3లో అత్యధికంగా ఎన్‌ఎంయు 24,302 ఓట్లు, ఆ తర్వాత ఇయుకు 24,129 ఓట్లు రాగా బహుజన వరర్స్‌కు 163, కార్మిక పరిషత్‌కు 2368, ఎస్‌డబ్ల్యుఎఫ్‌కు 2142, యునైటెడ్ వర్కర్స్ యూనియన్‌కు 257, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్‌కు 826 ఓట్లు మాత్రమే లభించాయి. క్లాస్-6 విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎంయుకు 24,522, ఇయుకు 23,343 ఓట్లు మాత్రమే లభించాయి. కార్మికశాఖ అడిషనల్ కమిషనర్ వై.సూర్యప్రసాద్ నేతృత్వంలో కార్మికశాఖ అధికారులు పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు. వీరందరికీ ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులపై
శే్వతపత్రం ప్రకటించాలి
వైకాపా డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు, వ్యయంపై శే్వతపత్రం ప్రకటించాలని వైకాపా రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం ఇక్కడ ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ విలేఖర్లతో మాట్లాడుతూ గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో 29వ ప్యాకేజీ పనుల వ్యయం పెంపుదలపై తక్షణం వాస్తవ వివరాలను వెల్లడించాలన్నారు. 29వ ప్యాకేజీ తొలి అంచనా వ్యయం 12 కోట్ల రూపాయలని, కాని ఏకంగా రూ.110 కోట్లకు పెంచారన్నారు. ఈ ప్యాకేజీలో డిజైన్ కూడా మార్చలేదన్నారు. రాష్ట్రం మొత్తం మీద వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి 40 ప్యాకేజీల అంచనా వ్యయం 11,229 కోట్లుంటే, ఈ ప్రభుత్వం 24,700 కోట్లకు పెంచిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం దెబ్బతింటుందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఎందుకు మాట్లాడలేదన్నారు. ఈ ప్రాజెక్టుపై చూసీచూడని తీరు మంచిది కాదని, తన స్వప్రయోజనాల కోసం కెసిఆర్‌తో రాజీపడ్డారన్నారు.

సమస్యల పరిష్కారానికి
కేంద్రం మొబైల్ యాప్
వినియోగదారులకు ఎంతో ఉపయోగమన్న రైల్వే శాఖ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 18: కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ ప్రారంభించిన కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల స్వీకరణ విధానం రైల్వే శాఖకు ఎంతో ఉపయోగమని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ఈ ఫిర్యాదుల పోర్టల్ ఆధారంగా తమ ఫిర్యాదులను, సలహాలను ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో పంపించవచ్చని తెలిపింది. ఈ పోర్టల్‌కు అనుబంధంగా ఒక మొబైల్ యాప్‌ను కూడా తాజాగా కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.
ఇంటర్నెట్ ద్వారా ఈ మొబైల్ యాప్‌ను వినియోగించి తాము ఎదుర్కొంటున్న సమస్యలు, అందుకు అవసరమైన పరిష్కారాలను తెలియజేయవచ్చని రైల్వే అధికారులు సూచించారు. రైల్వేలోని సమస్యలు, ఫిర్యాదులు చాలా వేగంగా పరిష్కారం చేసేందుకు ఈ మొబైల్ యాప్ ఉపయోగపడుతుందని రైల్వే వెల్లడించింది.
ధర్మానకు భద్రతను కొనసాగించాలి
ఏపి పోలీసులను ఆదేశించిన హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 18: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ప్రస్తుతం ఉన్న పోలీసు భద్రతను కొనసాగించాలని హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖను ఆదేశించింది. తనకు సెక్యూరిటీని తగ్గించారని మాజీ మంత్రి ధర్మాన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పివి సంజయ్ కుమార్ విచారించారు. కాగా ఎటువటి నోటీసు ఇవ్వకుండా భద్రతను తగ్గించారని గుర్తించామని, అందుకే గతంలో మాదిరిగా పోలీసు భద్రతను కొనసాగించాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. తదుపరి ఈ కేసును మార్చి 3కు వాయిదావేసింది.