రాష్ట్రీయం

సిరి కల్యాణపు బొట్టును పెట్టి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: నవమి సుముహూర్తం అభిజిత్ లగ్నం.. ఈ లగ్నంలో సిగ్గుల మొగ్గగా సీతమ్మ.. పెళ్లి కళతో రామయ్య మెరిసిపోతుండగా.. వీరిద్దరి జగత్ కల్యాణానికి భద్రగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 26న జరిగే స్వామివారి కల్యాణం కోసం భద్రాచలం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శ్రీ రామనవమిని పురస్కరించుకుని దక్షిణ అయోధ్యగా వినుతికెక్కిన భద్రాద్రికి భక్తుల రాక ముందే ప్రారంభమైంది. నవమి సందర్భంగా రామాలయాన్ని విద్యుద్దీపాలు, వెదురు పందిళ్లు, చాందినీ వస్త్రాలతో అలంకరించారు. కల్యాణాన్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పాదయాత్రగా భద్రాద్రికి చేరుకుంటున్నారు.

వైభవంగా ధ్వజారోహణం
శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ముందుగా ప్రాకార మండపంలో అగ్నిని మథించి యాగశాలలోని అగ్ని గుండంలో ప్రవేశపెట్టారు. తర్వాత గరుత్మంతుడిని మేల్కొలిపి గరుడ కుంభాన్ని శిరస్సుపై ధరించి వేద పండితులు దేవాలయం చుట్టూ తిరుగుతూ ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. అక్కడ ముందుగా స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, బ్రహ్మ ఘోష చేశారు. ఉత్సవమూర్తుల పూజల అనంతరం గరుత్మంతుడికి గరుడ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టారు. ఆ ప్రసాదానే్న సంతానం లేని స్ర్తిలకు గరుడ ముద్దలుగా పంపిణీ చేశారు. అనంతరం గరుడ చిత్రపటాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య ధ్వజస్తంభం పైకి అధిరోహించారు. ధ్వజారోహణంలో ఉన్న గరుత్మంతుడు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు క్షేత్రానికి రక్షకుడిగా ఉండాలని స్వామి ఆదేశించారు. గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన 108 మంది స్ర్తిలు ముందుగా గర్భ గుడిలో మూలవరులను దర్శించుకుని, గర్భాలయం వెనక భాగానికి వెళ్లి ప్రసాదంగా తీసుకున్నారు. భేరీ పూజ నిర్వహించి 33 మంది దేవతలను ఆహ్వానించి ప్రతిష్టించారు. బలిహరణం, బలిగజ్జెలు జరిపారు. 16 రకాల వాయిద్యాలతో భేరీపూజ జరిగింది. ఈ సందర్భంగా 21 మంది వాయిద్యకారులను దేవస్థానం స్వామి శేషవస్త్రాలతో సత్కరించింది. తర్వాత స్వామి హనుమంతుని వాహనంపై తిరువీధి సేవకు వెళ్లారు.