రాష్ట్రీయం

మూడు రాష్ట్రాలపై సిమి కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ సహా మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు విస్తరింప చేయాలని ‘సిమి’ భావిస్తోందా? అంటే ఔననే అంటున్నారు పోలీసులు. ఒడిశా రాష్ట్రంలోని రుర్కెలాలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు ఉగ్రవాదులు అదేపనిలో ఉండగా పట్టుబడటంతో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇప్పటికే వారిపై పలు కేసులు నమోదై ఉన్నందున వీలైనంత త్వరగా వారిని రాష్ట్రానికి రప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఏడుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు ఉగ్రవాద అనుమానితులు నల్గగొండ జిల్లా ఎన్‌కౌంటర్‌లో గత ఏడాది హతమవగా పరారైన మరో నలుగురు ఉగ్రవాదులనే తెలంగాణ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డూ (27), అంజాద్ ఖాన్ అలియాస్ దావూద్ (27), జాకీర్ హుస్సేన్ అలియాస్ సాదిక్ (32), మహమ్మద్ సాలిక్ అలియాస్ సల్లూల (33)ను తీసుకువచ్చేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిజానికి వీరు తెలంగాణ, కర్ణాటక, మహారాష్టల్రలో కార్యకలాపాల విస్తృతికి కుట్ర పన్నారు. ఇలా ఉండగా, కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంకు లూటీ కేసులో ఈ నలుగురు నిందితులుగా ఉన్నారు. దీంతో కరీంనగర్ పోలీసులు కూడా పిటి వారెంట్‌పై ఒడిశా నుంచి వీరిని తీసుకురావాలని నిర్ణయించారు.
నల్లగొండ జిల్లాలో రెండు, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో కేసు వీరిపై నమోదైనాయి. అలాగే సూర్యాపేటలో గత ఏడాది ఏప్రిల్ 2వ తేదీన పోలీసులపై జరిగిన కాల్పుల సంఘటనకు సంబంధించికూడా వీరిపై కేసులున్నాయి. ఈ కేసులోనే మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎజాద్దీన్, అస్లాం జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంకు లూటీ 2014 ఫిబ్రవరిలో జరిగింది. ఈ దోపిడీ కేసు చొప్పదండి పిఎస్‌లో నమోదైంది. సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు, హత్య కేసు నమోదైంది. కాగా 2014 ఫిబ్రవరిలో నల్లగొండ జిల్లా దేవరకొండ, అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కూడా మోటార్ బైక్ దొంగతనం కేసులు వీరిపై నమోదైనాయి. ఈ నిందితులు 2014 ఫిబ్రవరిలో మహబూబ్‌నగర్‌లో బైక్‌ను దొంగతనం చేసి, దేవరకొండకు వెళ్లి అక్కడ కూడా బైక్ చోరీ చేశారని పోలీసులు తెలిపారు. ఈ బైక్‌లతోనే చొప్పదండికి వెళ్లి బ్యాంకును లూటీ చేసి, వాహనాలను కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో వదిలేసి వెళ్లారు. ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు మొదట ఎజాద్దీన్, అస్లాంను హైదరాబాద్‌కు పంపించారు. ఇక్కడ శివార్లలో ఆశ్రయం పొందేందుకు పన్నాగం రచించారు. కాని ఈ ఇద్దరు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో మిగిలిన నలుగురు రూటు మార్చి ఒడిశాకు వెళ్లారు. ఒడిశాలో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు ఉర్దూ, హిందీ, మరాటీ బాగా మాట్లాడగలరు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించాలని వీరు కుట్ర పన్నారని, ఈ లోగానే పట్టుబడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నలుగురిని పిటి వారెంట్‌పై తీసుకురావాలని పోలీసులు నిర్ణయించారు. వీరిని పటిష్టమైన భద్రత మధ్య తీసుకువచ్చి హైదరాబాద్ పరిసరాల్లో వీరికి సహకరించిన వారి కూపీ లాగనున్నారు.