ఆంధ్రప్రదేశ్‌

విశాఖ మన్యంలో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు: విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మండల పరిధి మఠం భీమవరం పంచాయతీ గడిమామిడి సమీపంలో కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనతో మన్యవాసులు ఉలిక్కిపడి భయాందోళన చెందుతున్నారు. మారుమూల మఠం భీమవరం పంచాయతీ గూడెం, కొయ్యూరు మండలాల సరిహద్దు గడిమామిడి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కూబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు జరిగాయి.
భీకర ఎదురు కాల్పుల ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టుల వద్ద నుండి రెండు తుపాకులు, కిట్ బ్యాగ్‌లను గ్రేహౌండ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మన్యంలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచారు.
మావోయిస్టుల కదలికలు తగ్గాయని పోలీసుల వర్గాలు చెబుతున్న తరుణంలో ఎన్‌కౌంటర్ ఘటన చోటు చేసుకోవడంతో మళ్ళీ మావోయిస్టుల కదలికలు ఈ ప్రాంతంలో ప్రారంభమయ్యాయన్న వాదనకు బలం చేకూరినట్లు అయింది. ఈ ప్రాంతం విశాఖ- తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మారుమూల అటవీ ప్రాంతం కావడంతో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషయమై నర్సీపట్నం ఒఎస్‌డి అట్టాడ బాబూజీని ఫోన్ ద్వారా సంప్రదించగా ఎన్‌కౌంటర్ జరిగిన మాట వాస్తవమేనన్నారు. అయితే మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఎవరనేది గుర్తించాల్సి ఉందన్నారు.