రాష్ట్రీయం

రేపిస్టులను ఉరి తీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15: కాశ్మీర్‌లో చిన్నారి అసీఫాను అతికిరాతకంగా చెరచి, హత్య చేసిన నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ విద్యార్థినులు నినదించారు. విశాఖ నగరంలో ఆదివారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో అసిఫా హత్యోదంతంపై కదంతొక్కారు. అభంశుభం తెలియని చిన్నారిపై పైశాచికత్వానికి ఒడిగట్టిన కిరాతకులను కఠినంగా శిక్షించినప్పుడే భవిష్యత్‌లో పునరావృతం కావన్నారు. విద్యార్థినుల ప్రదర్శనను ఉద్దేశించి ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.ఉమామహేశ్వర రావు మాట్లాడారు. నిర్భయ చట్టం వచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు ఆగట్లేదన్నారు. లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను కాపాడుకునే పరిస్థితులు నెలకొనడం నిజంగా సభ్య సమాజానికే తలవంపులన్నారు. చిన్నారులు, మహిళలపై లైంగిన దాడులను నియంత్రించేలా కఠిన చట్టాలు రావాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలు గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ అసిఫా అత్యాచార నిందితులను రక్షించే చర్యలతో మానవత్వం మంటగలుస్తోందన్నారు. జాతి, మతం, కులం వంటి అంశాల ప్రాతిపదికను నిందితులను రక్షించేందుకు యత్నించే సంప్రదాయం నుంచి మనం బయటపడాలని నినదించారు. ఈ సందర్భంగా ఏయూ కళాశాల మైదానం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ విద్యార్థినులు నల్ల దుస్తులు ధరించి నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఈ ప్రదర్శనలో పాల్గొని నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.

చిత్రం..చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులను అడ్డుకోవడంలో భాగస్వాములం అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థినులు