ఆంధ్రప్రదేశ్‌

ఆ 525 గ్రామాల్లో జల సంరక్షణ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: రాష్ట్రంలో 525 గ్రామాల్లో మరింతగా జల సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయంపై సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 శాతం మేర వర్షపాతం లోటు ఉన్నా, 3 మీటర్ల మేర భూగర్భ జలాలను పెంచామన్నారు. నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమాలే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో 525 గ్రామాల్లో తాగునీటి రవాణా జరుగుతోందని, ఈ గ్రామాల్లో జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ఇంజక్షన్ వెల్స్ ద్వారా ఫలితాలు వచ్చాయని, 525 గ్రామాల్లో కూడా ఇంజక్షన్ వెల్స్ చేపట్టాలన్నారు. వరద నీరు ఇంజక్షన్ వెల్స్‌కు, పంటకుంటలకు చేరేలా చూడాలన్నారు. భూసారంలో సూక్ష్మ పోషకాల సమతుల్యత ఉండాలని, బోరాన్, ఫాస్ఫరస్‌లో హెచ్చుతగ్గులు లేకుండా చూడాలన్నారు. ఉరూరా పశుగ్రాస క్షేత్రాలపై దృష్టి సారించాలని, గోకులాలను ప్రారంభించాలన్నారు.