ఆంధ్రప్రదేశ్‌

వేడెక్కిన రాజకీయం....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 14: బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా 2010లో జరిగిన ఆందోళన నేపథ్యంలో మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా 16 మందికి నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల టీడీపీ శ్రేణుల్లో కలకలం చెలరేగుతోంది. బాబ్లీ ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ అప్పట్లో చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు ప్రాజెక్టు ముట్టడికి యత్నించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుతో సహా ఆందోళనకు దిగిన సుమారు 80 మందిని ఒకే చోట నిర్బంధించి ఆపై కేసులు నమోదు చేసింది. ఈ సంఘటన యూపీఏ హయాంలో జరిగితే తాజాగా ఎన్డీయే ప్రభుత్వం కేసును తిరగతోడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో నోటీసు సమాచారం చంద్రబాబుకు అందింది. కాగా శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా జలసిరికి హారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలసిరికి హారతి నిర్వహించిన అనంతరం జరిగిన బహిరంగసభలో తొలిసారిగా బాబ్లీ నోటీసులపై స్పందించారు. గోదావరిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని అందుకు వ్యితిరేకంగా పోరాడాం.. ఉత్తర తెలంగాణ ఎడారి కారాదనే భావనతో ఉద్యమిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. నేను నేరం చేయలేదు.. ఘోరాలు చేయలేదు.. అన్యాయం అస్సలే చేయలేదు.. అనవసరమైన కేసులో ఇరికించి నోటీసీలు ఇచ్చామంటున్నారు.. ఏం చేస్తారో చేయండని ఆరోజే పోలీసులకు చెప్పాం.. ఇప్పుడు నోటీసులు.. అరెస్టు వారెంట్లు అంటున్నారు.. అధికారంలో ఉన్నా..లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందో ఆలోచించాలి.. నీటి భద్రత ఇవ్వటమే నా లక్ష్యం.. అన్ని ప్రాంతాలకు నీరిచ్చే వరకు జలదీక్ష ఆగదని తేల్చిచెప్పారు. ఉత్తర తెలంగాణకు నీటి వనరులపై ఉద్యమించిన చంద్రబాబు ఏపీలో జలసిరికి హారతి కార్యక్రమం ప్రారంభించిన రోజే నోటీసులు అందటం గమనార్హం. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేయటం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, వైసీపీల కుట్రలో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు పంపారని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా స్పందించకుండా ఇప్పుడే నోటీసులు అందజేయటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలతో సహా సీపీఐ, కాంగ్రెస్‌లతో కలిసి మహాకూటమిగా అవతరించేందుకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో నోటీసులు ఏ రకమైన ప్రభావం చూపుతాయనే విషయమై తెలుగుదేశం పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. నోటీసులపై ఏపీ టీడీపీ నేతలతో పాటు టీటీడీపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు వ్యూహరచన చేశారని ఇదే తరహాలో తెలంగాణలో కూడా పావులు కదుపుతున్నారనే అక్కసుతో, ఓటమి భయంతో బీజేపీ నోటీసులు తెరపైకి తెస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు ఉన్న మాకు నోటీసులు ఎందుకు పంపలేదని కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. ఈనెల 21వ తేదీలోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించటంతో ఏం జరుగుతుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. గత ఎనిమిదేళ్లుగా 22 సార్లు నోటీసులు అందాయని కోర్టుకు హాజరుకానందునే అరెస్టు వారెంట్ జారీ అయిందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే పీసీసీ మాత్రం అరెస్టు వారెంట్ నోటీసులను తీవ్రంగా ఖండించింది. రాజకీయ దురుద్దేశ్యంతో ప్రజా ఉద్యమాలకు సంబంధించి అరెస్టు వారెంట్ జారీ చేయటం సమంజసంకాదని పీసీసీ చీఫ్ రఘువీరా ఖండించటం కొసమెరుపు. ఇదిలా ఉండగా ధర్మాబాద్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. దీనిపై ఏ రకంగా స్పందించాలనే విషయమై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు సమాచారం.