ఆంధ్రప్రదేశ్‌

కేంద్రానికి పట్టని బలిదానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అసెంబ్లీ వ్యూహకమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 18: అసమర్థ ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికే చేటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అసెంబ్లీ వ్యూహకమిటీ సభ్యులతో మంగళవారం ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలన్నారు. ప్రతిపక్షం లేదనేది ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. ప్రజలిచ్చిన బాధ్యతల నిర్వహణలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. గత నాలుగేళ్లలో పేదల సంక్షేమానికే అధిక ప్రాధాన్య మిచ్చామని తెలిపారు. ఏయే వర్గానికి ఎంత లబ్ధి చేకూర్చామో వివరించాలని సూచించారు. సాంకేతికత ద్వారా పారదర్శకత, ప్రజాహితంగా అమలు చేస్తున్నామనే భావన ప్రజల్లో కలగాలన్నారు. ఆర్టీజీపై అర్థవంతమైన చర్చ జరపాలన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేయాలన్నారు. కర్నూలు జిల్లా జలదుర్గంలో ప్రత్యేక హోదా కోసం మహేంద్ర ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారంకాదని, ప్రత్యేక హోదా కోసం జీవితాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా కేంద్రంలో కదలికలేదన్నారు. భావోద్వేగాలను రెచ్చకొట్టటం సరికాదన్నారు. పోరాటం ద్వారానే ప్రత్యేక హోదా సాధిద్దామని పిలుపునిచ్చారు. మహేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని ప్రకటించారు.

ఆ కుటుంబాలకు అండగా ప్రభుత్వం
* అసెంబ్లీలో సీఎం నివాళి
విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగం చేసుకున్న ఏడు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హాదా కోసం కర్నూలు జిల్లాలో మద్దిలేటి మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే. ఈ అంశాన్ని సభలో మంగళవారం సీఎం ప్రస్తావిస్తూ, ప్రాణాలు చాలా విలువైనవని, హోదా సమస్య పరిష్కారం కాకపోవడం కూడా బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకూ ధర్మ పోరాటం చేద్దామన్నారు. ఆత్మత్యాగాలను చేసుకోవద్దని, భావోద్వేగాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. హోదా కోసం ఆత్మత్యాగాలు చేసిన తిరుపతిరావు, సుధాకర్, త్రినాద్ సహా ఏడుగురి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని మరోసారి పిలునిచ్చారు. కేంద్రం మనసు మార్చుకుని, హొదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం రెండు నిమిషాలు సభలో వౌనం పాటించారు.