ఆంధ్రప్రదేశ్‌

నూతన వేతనాలపై చర్చకు తక్షణం పే కమిటీని వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: పే రివిజన్ కమిషన్ వేతన సవరణకై కసరత్తు ప్రారంభించబోతున్న నేపథ్యంలో తగు ప్రతిపాదనలు అందచేసేందుకుగాను ముందస్తు చర్చకై తక్షణం పే కమిటీని ప్రకటించాలని కోరుతూ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అధ్యక్షుడు వైవీ రావు, తదితరులు గురువారం సంస్థ చైర్మన్ వర్లరామయ్య, ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 2017 ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన వేతనాల సవరణను ఆ నాటికి ఉన్న కరవు భత్యాన్ని బేసిక్ పేతో కలిపి దానికి 50 శాతం ఫిట్‌మెంట్‌తో వేతనాలను సవరించాలన్నారు. ఇందుకోసం మొత్తం 90 అంశాలతో కూడిన ప్రతిపాదనలను అందజేసామన్నారు. వీటిల్లో ప్రధానంగా అన్ని స్థాయిల్లోను ఉద్యోగ, కార్మికుల సమస్యలు, సర్వీస్ కండిషన్స్, ఎలవెన్స్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం 19 శాతం మధ్యంతర భృతి ఇచ్చారని భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 19శాతం పైన ప్రకటించినా అదే స్థాయిలో తమకూ వర్తింప చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహిళా కండక్టర్‌లను కార్గో సర్వీసుల్లో వినియోగించుకోవాలని, ఉద్యోగి చనిపోతే ఆ ఉద్యోగి స్థానంలో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.