ఆంధ్రప్రదేశ్‌

యువతకు ఆసరాగా ముఖ్యమంత్రి యువనేస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 21: ముఖ్యమంత్రి యువనేస్తం పథకం నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తుందని టీడీపీ జాతీయ కార్యక్రమాల కమిటీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు వివివి చౌదరి పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి ఆధ్వర్యాన ఆ శాఖ రాష్టస్థ్రాయి విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వివివి చౌదరి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌ల మానస పుత్రిక అన్నారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని చేరువ చేస్తామన్నారు.
యువనేస్తం పథకం రూపకల్పనలో మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమని తెలిపారు. లోకేష్ 31 సార్లు సమావేశాలు నిర్వహించి 1000 గంటలు కష్టపడి ప్రణాళికాబద్ధంగా ఈ పథకాన్ని రూపొందించారని పేర్కొన్నారు. ఈ పథకం కింద నిరుద్యోగులను చేర్చడంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు భృతితో పాటు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మంచౌదరి మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని, అయితే లోకేష్ ఈ పథకాన్ని సవాల్‌గా తీసుకుని రూపొందించారని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున అక్టోబర్ 2వ వారంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి అభినందన సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ కమిటీ సభ్యుడు ఆలూరి రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వెంకటప్ప, భాస్కరనాయుడు, 13 జిల్లాల టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.