ఆంధ్రప్రదేశ్‌

యూపీఏ హయాంలోనే రాఫెల్‌కు టెండర్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 25: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌వాద్రాకు యుద్ధవిమానాల కాంట్రాక్టు ఇవ్వకపోవటం వలనే రాఫెల్ డీల్‌లో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌పార్టీలేనిపోని ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్ధాయిలో విమర్శించారు. మంగళవారం స్థానిక కాపుకళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ పార్టీలన్ని కలిసి యుద్ధవిమానాల కొనుగోళ్ళలోభారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్రమోదీపై బురదజల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని వాటిని ప్రజలు గమనించి తగిన సమయంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2014వరకు భారతదేశ రక్షణను యూపీఏ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కన్నా ధ్వజమెత్తారు. 2012లో యూపీఏ హయాంలో దసాల్ట్ కంపెనీకి ఒక్కొక్క విమానానికి 700 కోట్లరూపాయల చొప్పున అనుమతులు ఇచ్చి కొనుగోలు చేయలేదన్నారు. తమ హయాంలో 1173 కోట్లరూపాయలతో ఒక్కొక్కవిమానాన్ని కొనుగోలు చేసేందుకు హెచ్‌ఎఎల్ కంపెనీతోపాటు, మరో 72 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. అయితే యుద్ధ విమానాలకు సంబంధించి నాగపూర్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయటంతోపాటు టెక్నాలజీతో కూడిన విమానాలను కొనుగోలు చేస్తున్నామని అందులో భాగంగా మిస్సయల్స్, విడిభాగాలు, సామగ్రి తదితర భాగాలను కొనుగోలు చేసేందుకు టెండర్లు పెంచామన్నారు. యూపీఏ హయాంలో కేవలం విమానాల కొనుగోలుకే ధరలు నిర్ణయించారని, తాము విడిభాగాలకు, యూనిట్‌ను నెలకొల్పేందుకు పెంచాల్సివచ్చిందే తప్ప ఎలాంటి కుంభకోణాలకు పాల్పడలేదన్నారు. రాఫెల్ కుంభకోణంపై కేంద్ర ఆర్ధికశాఖమంత్రి అరుణ్‌జైట్లీ రాహుల్‌గాంధీకి 15ప్రశ్నలు సంధించారని దమ్ముంటే వాటికి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌పార్టీతో జతకట్టిన తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమపార్టీపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబులాంటి అవినీతిపరుడు భారతదేశంలో మరొకరు లేరని విమర్శించారు. సొంత మామకే వెన్నుపొటుపొడిచిన ఆయన ఎవరినైనా సునాయాసంగా వెన్నుపోటుపొడుస్తారని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్ర ఐటి శాఖమంత్రి నారా లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతి ఉద్యోగాన్ని అవుట్‌సోర్సింగ్ పేరుతో కాంట్రాక్టర్లను పెట్టి వందలకోట్లరూపాయలు జేబులో వేసుకున్నారని దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కడపలో స్టీల్ ప్లాంట్, ప్రకాశం జిల్లా రామాయపట్నం మేజర్‌పోర్టు రావటం ముఖ్యమంత్రికి ఇష్టం లేదన్నారు.
మేజర్‌పోర్టుపై ప్రజా ఉద్యమాన్ని చేపడ్తామన్నారు. వచ్చేనెల నుండి రాష్టవ్య్రాప్తంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు మాట్లాడుతూ దేశంలో ముస్లింలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్రమోదీ ట్రిబుల్ తలాక్‌ను తీసుకువచ్చి విప్లవాత్మాకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఓటమి పాలౌతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ విలేఖర్ల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, రాష్టప్రార్టీనాయకులు జమ్ముల శ్యాంకిశోర్, సురేష్‌రెడ్డి, ఎడ్లపాటి స్వరూపరాణి, దారా సాంబయ్య, షేక్ ఖలీఫాతుల్లా భాషా పాల్గొన్నారు.