ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల నాటికి అనూహ్య మార్పులు: సబ్బం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ, లోక్‌సభ ఎన్నికలు జరిగే సమయానికి అనుహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని మాజీ ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ఏపీ జర్నలిస్టుల సంఘం గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సబ్బం మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ శాసన సభకు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ తెర వెనక నాయకత్వంలో వైకాపా, జనసేన సీట్ల సర్దుబాటు చేసుకుంటే తెలుగుదేశం ఇబ్బందుల్లో పడుతుందని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మనస్తత్వాల దృష్టా వారు నిజంగానే కలుస్తారనేది చెప్పటం సాధ్యం కాదని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం కూడా ఉన్నదా? అని ఒక విలేఖరి అడగ్గా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు అవసరమున్న వారితో చేతులు కలుపుతాయని చెప్పుకొచ్చారు. ‘మీరు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారా?’ అని ప్రశ్నిస్తే ఏపీ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేసే పార్టీలో చేరుతానన్నారు. అలాగే శాసన సభకు పోటీ చేస్తానని ఆయన బదులిచ్చారు. మొదట ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని, దానికి కూడా కట్టుబడి ఉండకుండా మళ్లీ ప్రత్యేక హోదా కావాలనటం ఏ విధంగా సమర్థనీయమని మరో విలేఖరి ప్రశ్నించగా ‘బీజేపీ ప్రత్యేక ప్యాకేజీని కూడా అమలు చేయలేదు కాబట్టే సీఎం ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు’అని మాజీ ఎంపీ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వక, ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయకపోతే చంద్రబాబు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మాటకు కట్టుబడి ఉండే పార్టీ అనే ముద్ర ఉండేది అయితే ఇప్పుడది చెప్పేది ఒకటి చేసేది మరొకటని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ పార్లమెంటులో పలుమార్లు చెప్పారని ఆయన గుర్తుచేశారు. ప్రతి రాజకీయ పార్టీ అధికారం కోసం పని చేస్తున్నాయే తప్ప ప్రజల గురించి ఆలోచించటం లేదని సబ్బం వాపోయారు.
మాజీ మంత్రి సుజాతపై అనుచిత పోస్టింగ్
చింతలపూడి, జూలై 19: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతను అసభ్యకరంగా దూషిస్తూ ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై చింతలపూడి మండలం భట్టువారిగూడెం ఎంపీటీసీ సభ్యుడు డి వీరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేపై అసభ్యకరంగా పోస్టు చేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చింతలపూడి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.