ఆంధ్రప్రదేశ్‌

నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: భవిష్యత్తు నాలెడ్డి ఎకానమీదేనని, అందుకే ఐటీ రివల్యూషన్ ఫలితాలు అందుకుని ముందుకెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. భవిష్యత్తులో సేవల్లోనే ప్రభుత్వం కనిపిస్తుందని, పరిపాలనలో ఇదో విప్లవమని అభివర్ణించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో ఈ-ప్రగతి కోర్ పోర్టల్‌ను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మనం ఒక స్ఫూర్తిదాయక కాలంలో జీవిస్తున్నామని, తన హయంలో ఐటీ విప్లవం చూడటం అదృష్టమని అన్నారు. ఐటీ ఒక విప్లవమైతే, ఐఓటీతో కలిస్తే అద్భుతమవుతుందని తెలిపారు. రియల్‌టైమ్, ఎనలిటిక్స్‌తో కలిసి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామన్నారు. ఏదిచేసినా అంతిమ ధ్యేయం ప్రజాసంతృప్తేనని చెప్పారు. ఐటీలో విప్లవం వల్ల కనిపించని ప్రభుత్వం, కనిపించే సేవలు ప్రజలకు పాలనా తీరును తెలియచేస్తాయన్నారు. భవిష్యత్తులో సేవల్లోనే ప్రభుత్వం కనిపిస్తుందని, పరిపాలనలో ఇది ఒక పరిణామక్రమమని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీకి సంబంధించి అన్ని అంశాలను ఆన్‌లైన్‌లో ఉంచామని, ప్రతి విభాగం ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. ప్రజా సాధికార సర్వే విజయవంతంగా నిర్వహించామని, రాష్టస్థ్రాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ వివరాలపై సర్వే చేశామన్నారు.
కోర్ డ్యాష్‌బోర్డుతో అనుసంధానం ద్వారా సంక్షేమ కార్యక్రమాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యా, ఆరోగ్య సంబంధ పథకాల వివరాలు పరిపాలనలో పెనుమార్పుగా అభివర్ణించారు. ఈ-ప్రగతి ద్వారా పరిపాలనలో అవినీతి నిర్మూలన ఒక లక్ష్యమని, జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుందన్నారు. గతంలో ఐటీలో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలిపానని, అభివృద్ధికి ఐటీ వెనె్నముకగా ఉంటోందన్నారు. వ్యవసాయంలో ఒక విప్లవం తీసుకొచ్చామని, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచామని చెప్పారు. జలవనరుల రంగంలో నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. రియల్‌టైమ్ గవర్నెన్సుతో పరిపాలన సాగిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ప్రకటించారు. విద్య, వైద్యం, ఐటీ రంగంలో తమ బృందం దేశంలోనే నెంబర్ వన్ అని కితాబిచ్చారు. సృజనాత్మకతతో ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీలేదన్నారు. ఇదో సుదీర్ఘ ప్రయాణమని, రానున్న కొద్దిరోజుల్లో అన్నింటా ఏపీ అగ్రమామిగా ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గత 20సంవత్సరాలుగా ఐటీ రంగంలో చేసిన కృషి గుర్తుకొస్తోందన్నారు. తాను విజ్ఞానాన్ని నమ్ముతానని, ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అడుగులు వేయాల్సి ఉంటుందన్నారు. ఎక్కడ జ్ఞానం ఉన్నా గుర్తించాలని, నేర్చుకోవాలన్నారు. తాను నిత్య విద్యార్థినని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిపాలనలో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఐటీని ఉపయోగించి చివరి వ్యక్తి వరకూ మెరుగైన పాలన అందించ గలుగుతున్నామన్నారు.
పౌరసేవలకు టెక్నాలజీ జోడించి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలకు సకాలంలో ధృవపత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఐటీ రంగంలో ఒక బలమైన శక్తిగా ఏపీ రూపుదిద్దుకుందన్నారు. ఈ-ప్రగతి ద్వారా ఒక ఆలోచనకు ఒక రూపం తీసుకొచ్చామని తాను గర్వంగా చెప్పగలుగుతున్నానన్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో మరింత మార్గదర్శక విధానంతో ముందుకు వెళ్తామనడంలో సందేహం లేదని చంద్రబాబు విశ్వాసం వ్యక్తపరిచారు.
మేలైన పరిపాలనే లక్ష్యం:లోకేష్
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజలకు మేలైన పరిపాలన అందించేందుకు 34 శాఖల సేవలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చామన్నారు. ఈ-ప్రగతి ప్రజలకు సేవలందించడంలో ముందువరుసలో ఉండే కార్యక్రమన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా కనిపించే ప్రభుత్వ సేవలు, కనిపించని ప్రభుత్వం విధానంలో మెరుగైన పౌరసేవలు అందించగలుగుతామన్నారు. ఈ-ప్రగతి పథంలో ఆధార్ సంఖ్య వినియోగం అత్యంత ప్రామాణికంగా నిలవనుందన్నారు.
చాలామందికి డ్రైవింగ్ లైసెన్సు ముగిసినా ఎలా రెన్యువల్ చేసుకోవాలో తెలియక ఆసక్తి చూపడం లేదన్నారు. అదే ప్రజలకు తెలియచేయగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ఆగస్టులో యువతకు చేయూత అందించే నిరుద్యోగ భృతి అమల్లోకి తెస్తామన్నారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామని లోకేష్ వెల్లడించారు.
ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ఈ-ప్రగతి ద్వారా పౌరసేవల్లో వేగవంతమైన విధానం సాధ్యం అవుతుందన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పారదర్శకతకు కేంద్రంగా ఈ-ప్రగతి నిలుస్తుందన్నారు. ఫీచర్ వరల్డ్ ప్రతినిధి నియిల్ జాకబ్, పారిశ్రామికవేత్త తావి, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ అనిల్ భన్సాలీ, పెగా ఇండియా ఎండీ సుమన్‌రెడ్డి, పీపుల్ క్యాపిటల్ ఎండీ శ్రీనివాసరాజు, ఐటీ సలహాదారు జె సత్యనారాయణ , ఈ-ప్రగతి సీఈవో బాలసుబ్రహ్మణ్యం ప్రసంగించారు.