ఆంధ్రప్రదేశ్‌

ఇక ఆర్టీసీలో ఈ-టెండర్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకతతో నిర్వహించేందుకు వీలుగా ఈ-టెండర్ విధానం దశల వారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఎపీఎస్ ఆర్టీసీ ఈడీ (ఇంజనీరింగ్) ఎ.కోటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇక నుంచి సంస్థకు అవసరమైన వివిధ కొనుగోళ్లను ఈ-టెండర్ విధానంలో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. సంస్థ ఎంపిక చేసుకున్న ఈ-కామర్స్ పోర్టల్ ఎంఎస్‌టీసీ ద్వారా ఈ-టెండర్ ప్రక్రియ అమలు చేస్తామన్నారు. మొదటగా 136 అద్దె బస్సులను ఈ-టెండర్ విధానంలోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ-టెండర్ విధానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్రస్తుతం ఆర్టీసీ ప్రతి ఏడాది కొత్త బస్సులు, విడి భాగాలు, టైర్లు, ఆయిల్స్ తదితర కొనుగోళ్లకు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఇప్పటి వరకూ సాధారణ టెండర్ విధానం అమలు చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీతో లావాదేవీలు చేసేందుకు ఆసక్తి ఉన్న వారందరూ కామర్సు పోర్టు ద్వారా టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
తమ సంస్థ పేర్లు నమోదు, డిజిటల్ సంతకం వంటివి నమోదు చేసుకోవాలి. అంతకుముందు ఈ వివరాలను డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాకర్, ఏటీఎం విశ్వనాథ్ తదితరులకు ఈడీ (ఆపరేషన్స్) జయరావు వివరించారు.